గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన శిల్పా చక్రపాణి ఎమ్మెల్సీ పదవి వదులుకుని వైసీపీలోకి వచ్చి, 2019 ఎన్నికల్లో శ్రీశైలం ఎమ్మెల్యేగా నిలబడి భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా శిల్పా దూసుకెళుతున్నారనే చెప్పొచ్చు. నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటూ, శ్రీశైలం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటపట్టిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కోట్ల నిధులతో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, ఆసుపత్రులు, వాటర్ ట్యాంకులు, రైతు బజార్‌లు, పశువుల ఆసుపత్రులు, జగనన్న కాలనీలు పేరిట పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇక ప్రభుత్వ పథకాల అమలులో శిల్పా, ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. అటు పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ విధంగా నియోజకవర్గంలో శిల్పా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అయితే శ్రీశైలం నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. అటు పలుచోట్ల డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే రాజకీయంగా శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇప్పటికే అక్కడ పార్టీకి తిరుగులేకుండా ఉంది. ఇక్కడ టీడీపీకి సరైన ఆదరణ లేదు. ఆ పార్టీ నాయకుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి సైతం యాక్టివ్‌గా పనిచేయడం లేదు. ఫలితంగా శ్రీశైలంలో టీడీపీ ఇంకా వీక్ కాగా, వైసీపీ మరింత స్ట్రాంగ్ అయింది. దీని బట్టి చూస్తే శ్రీశైలంలో మళ్ళీ శిల్పా గెలుపు సులువే అని తెలుస్తోంది.