ఇక జక్కంపూడి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా సరే ఏ మాత్రం తడబడకుండా ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకెళుతున్నారు.
రాజానగరంలో కొత్తగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, సిసి రోడ్లు, నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఉచితం ఇళ్ళు నిర్మించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యలకు లేకుండా చూసుకుంటున్నారు. అటు జక్కంపూడి రామ్మోహన్ రావు ట్రస్ట్ ద్వారా ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఇక రాజానగరంలో దెబ్బతిన్న రోడ్లని అభివృద్ధి చేయడం, కొత్తగా రైతు బజార్లు నిర్మాణం, నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇలా అన్నీ రకాలుగా రాజానగరం ప్రజలకు రాజా సేవ చేస్తున్నారు.
అందుకే తక్కువ కాలంలోనే రాజా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న రాజాకు ప్రజల మద్ధతు పెరిగింది. అటు టీడీపీ ఇక్కడ వీక్ అయింది. రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అంత దూకుడుగా పనిచేయడం లేదు. ఇక మొత్తం మీద చూసుకున్నట్లైతే రాజానగరంలో రాజాకు తిరుగులేదని తెలుస్తోంది. రెండోసారి కూడా రాజాకు ఎమ్మెల్యేగా గెలవడం సులువే అని చెప్పొచ్చు.