మొదట నుంచి వైఎస్సార్ ఫ్యామిలీని అభిమానించే నాయకుల్లో టి‌జే‌ఆర్ సుధాకర్ బాబు కూడా ఒకరు. వైఎస్ మీద అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చిన సుధాకర్ బాబు... 2004లో కాంగ్రెస్‌లో స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఇక అప్పటిలోనే దూకుడుగా రాజకీయం చేస్తూ వచ్చిన సుధాకర్....వైఎస్ అనుచరుడుగా కొనసాగేవారు. అప్పటిలోనే టీడీపీపై దూకుడుగా విమర్శలు చేశారు. ఇక వైఎస్సార్ మరణం తర్వాత కూడా సుధాకర్, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. దీంతో 2017లో సుధాకర్...కాంగ్రెస్‌ని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలోకి రావడమే జగన్, సుధాకర్‌కు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. ఇక 2019 ఎన్నికల్లో సుధాకర్...అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా సుధాకర్ బాగానే పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి అండగా ఉంటున్నారు.

నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలపై త్వరగానే స్పందిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే అధికార ఎమ్మెల్యేగా , ప్రతిపక్ష టీడీపీ మీద దూకుడుగా విమర్శలు చేయడంలో సుధాకర్ ముందున్నారు. ఇక ప్రభుత్వం తరుపున ప్రతి సంక్షేమ పథకం...సంతనూతలపాడులో అమలు అవుతుంది. అటు నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇక ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నియోజకవర్గంలో పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదు. కరోనా వల్ల గ్రానైట్‌ పాలిషింగ్‌ పరిశ్రమలు భారీగా దెబ్బతిన్నాయి. ఇక్కడ తాగునీటి సమస్య కూడా ఎక్కువగానే ఉంది. అలాగే పలు గ్రామాల్లో రోడ్ల సౌకర్యం కూడా అంతంత మాత్రమే. ఇక రాజకీయంగా వస్తే సుధాకర్ బాబు ప్రస్తుతానికైతే కాస్త స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఆయనకు ప్లస్. అటు టీడీపీ తరుపున విజయ్ కుమార్ పని చేస్తున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై బాగానే పోరాడుతున్నారు. అయితే సుధాకర్ బాబు మరో మూడేళ్లు కష్టపడితేనే మరొకసారి గెలిచే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఈ సారి సంతనూతలపాడులో వైసీపీకి ఇబ్బంది తప్పదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: