
అటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే చేస్తున్నారు...రాజానగరంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, సిసి రోడ్ల నిర్మాణాలు చేశారు. జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్ళు నిర్మించే కార్యక్రమం, నాడు-నేడు ద్వారా పాఠశాలలని బాగు చేయడం లాంటివి చేశారు. అటు స్థానిక ఎన్నికల్లో రాజానగరంలో వైసీపీకి అదిరిపోయే విజయాలు దక్కేలా చేశారు. ఇలా అన్నిరకాలుగా పనులు చేస్తున్న రాజాని టిడిపి నేత వెంకటేష్ గట్టిగానే టార్గెట్ చేశారు.
నియోజకవర్గంలో వైసీపీ నేతలు చేసే అక్రమాలపై పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వెంకటేష్... వైసీపీ నేతలు రాజానగరంలో పెద్ద ఎత్తున భూకజ్జాలు, ఇసుక దోపీడీ, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు, దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ట్రస్ట్ పేరుతో రూ.15 కోట్లు వైసీపీ నాయకులు అక్రమ వసూళ్లు చేశారని, అటు ఆవ భూముల్లో అక్రమాలకు లెక్కలేవని అంటున్నారు. అలాగే రాజా ఫ్యామిలీ కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు రాజాకు మైనస్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
గతంలో వెంకటేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ తరహా ఆరోపణలే ఎదురుకున్నారు. టిడిపి అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. అందుకే గత ఎన్నికల్లో వెంకటేష్ ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు రాజాపై ఆరోపణలు వస్తున్నాయి. మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఏం అవుతుందో చూడాలి.