1994లో ఒకసారి...మళ్ళీ 2004 ఎన్నికల్లో మరొకసారి మాత్రమే టీడీపీ కమలాపురంలో గెలిచింది. ఇంకా అంతే ఇంకా ఎక్కువసార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, గత రెండు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. వైసీపీ తరుపున జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే కమలాపురంలో జగన్ మేనమామకు తిరుగులేదనే చెప్పాలి. ఆయన ఎమ్మెల్యేగా కూడా అదరగొడుతున్నారు...ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉండటంలో ముందున్నారు.
ఎలాగో జగన్‌కు బంధువు కాబట్టి నియోజకవర్గానికి కావల్సిన పనులు చేయించుకుంటున్నారు...అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కమలాపురంలో కొత్తగా జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్ళు కట్టిస్తున్నారు. అటు నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. ఇక నియోజకవర్గంలో తాగునీటి సమస్యలని తగ్గించేందుకు రవీంద్రనాథ్ కృషి చేస్తున్నారు. అలాగే కొత్తగా గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం, వాటర్ ట్యాంకుల నిర్మాణాలు జరుగుతున్నాయి.
రాజకీయంగా వస్తే కమలాపురంలో రవీంద్రనాథ్‌దే పైచేయి..ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ లేదు. గత కొన్ని ఎన్నికలుగా ఇక్కడ టీడీపీ తరుపున పుత్తా నరసింహారెడ్డి పోటీ చేసి ఓడిపోతూ వస్తున్నారు..ఈయనకు ఏ మాత్రం జగన్ మేనమామకు చెక్ పెట్టే అవకాశం రావడం లేదు. అటు స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ హవానే నడిచింది...అతి త్వరలోనే జరగనున్న కమలాపురం మున్సిపాలిటీలో కూడా సత్తా చాటాలని రవీంద్రనాథ్ చూస్తున్నారు. ఏదేమైనా కమలాపురంలో జగన్ మేనమామని ఓడించడం కష్టమే అని తెలుస్తోంది.