ఇక ఈయనే 2018లో టీఆర్ఎస్ తరుపున గెలిచారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ చేసి...మళ్ళీ రెండోసారి గెలిచారు. సరే టీఆర్ఎస్ నుంచి గెలిచారు...పైగా ఆ పార్టీ అధికారంలో ఉంది..దీంతో నియోజకవర్గాన్ని ఏమన్నా అభివృద్ధి బాట పట్టించారా? అంటే అబ్బే పెద్దగా లేదనే చెప్పాలి. గతంలో ఎలా ఉందో...తెలంగాణ వచ్చాక కూడా మిర్యాలగూడలో పెద్దగా మార్పులు వచ్చినట్లు కనిపించలేదు.
కాకపోతే ప్రభుత్వం నుంచి జరిగే సంక్షేమ, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం యథావిధిగానే నడుస్తున్నాయి. కేటీఆర్ వల్ల కాస్త మిర్యాలగూడ పట్టణం కాస్త అభివృద్ధి చెందుతుంది. ఇక మిర్యాలగూడలో సమస్యలు కూడా ఎక్కువే. తాగునీరు, సాగునీటి కష్టాలు ఎక్కువే. రోడ్ల సమస్యలు కూడా బాగా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే భాస్కరరావుపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువయ్యాయి. భూ కబ్జాలకు సంబంధించి విషయంలో కొన్ని వివాదాలు కూడా వచ్చాయి.
ఇక రాజకీయంగా చూస్తే..ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కరరావు బలం కాస్త తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ ఇంకా పుంజుకోవాల్సిన అవసరముంది. తెలంగాణ వచ్చాక కూడా ఇక్కడ సిపిఎం పార్టీ మళ్ళీ పికప్ అవ్వలేకపోయింది. కానీ కాంగ్రెస్, సిపిఎంలు కలిసి పనిచేస్తే మాత్రం టీఆర్ఎస్‌కు కాస్త గెలుపు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండు పార్టీల పొత్తు ఉంటుందో లేదో చెప్పలేం...కానీ కాంగ్రెస్ మాత్రం సొంతంగా పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే మిర్యాలగూడలో కారుకు మాత్రం కష్టాలు పెరుగుతున్నాయనే చెప్పొచ్చు.