వనమా వెంకటేశ్వరావు ..తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేస్తూ వచ్చిన నేత. తొలిసారి 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 1989 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి గెలిచారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఓడిపోగా, 1999 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. మళ్ళీ 2004లో కూడా సత్తా చాటారు. 2009లో ఓటమి పాలైన వనమా 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చి 2018 ఎన్నికల్లో పోటీ చేసి మరొకసారి కొత్తగూడెం బరిలో గెలిచారు. ఇలా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వనమా కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక టీఆర్ఎస్‌లో చేరాక...తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. మామూలుగా వనమా పెద్దగా వివాదాలు లేని నేత...అలాగే మృదుస్వభావిగా ఉంటూ..ప్రజలకు అండగా ఉంటూ వస్తున్నారు.

ఇక అలాంటి నేత వారసుడుగా ఉన్న వనమా రాఘవ...అనేక వివాదాల్లో ఉన్నారు. షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతూ.. దందాలు, సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలు..ప్రజలని బెరించడం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్తి గొడవలు సరిచేయమని వచ్చిన రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యాడు. రామకృష్ణ అనే అతను తమ ఆస్తి తగాదాలు సెటిల్ చేయమని రాఘవ దగ్గరకొచ్చారు. కానీ రాఘవ..రామకృష్ణ భార్యని కోరుకున్నాడు. కానీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రామకృష్ణ....తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అలాగే తన చావుకు కారణం వనమా రాఘవ అని సెల్ఫీ వీడియో కూడా తీశారు.

ఇలా రాఘవ దెబ్బకు వనమాకు పెద్ద మైనస్ అయింది. ఇక ఆ తప్పుని సరిచేసుకునేందుకు వనమా ప్రయత్నిస్తున్నారు...కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది...వనమాకు తన తనయుడు వల్లే ఓటమి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఒక్క ఘటనతో కొత్తగూడెం రాజకీయాలు మారిపోయాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

trs