
అయితే టీడీపీ పరిస్తితి మరీ దిగజారిపోవడంతో వీరయ్య సైకిల్ దిగి కారు ఎక్కేశారు. అలాగే మెచ్చాని కూడా తీసుకురావడానికి చూశారు గానీ...మెచ్చా మాత్రం టీడీపీని వదిలేది లేదని కూర్చున్నారు. కానీ రాను రాను టీడీపీ క్లోజ్ అయ్యే పరిస్తితికి వచ్చింది. దీంతో తప్పక మెచ్చా సైకిల్ దిగి కారు ఎక్కారు. మెచ్చా సైడ్ అవ్వడంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి తొలిసారి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
ఇక మెచ్చా గురించి మాట్లాడుకుంటే..ఆయన కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన నాయకుడు. సర్పంచ్ స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో అశ్వరావుపేటలో పోటీ చేసి వైసీపీపై స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో ప్రజాకూటమి తరుపున టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగి విజయం సాధించారు. రెండు ఏళ్ళు టీడీపీలో పనిచేసి చివరికి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరాక మెచ్చాకు కావాల్సిన పనులు అవుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుని నియోజకవర్గంలో పనులు చేయగలుగుతున్నారు. ప్రజలకు టచ్‌లోనే ఉంటారు. అయితే ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతానికైతే మెచ్చా పరిస్తితి బాగానే ఉంది. కానీ రానున్న రోజుల్లో టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరిగితే మెచ్చాకు ఇబ్బందికర పరిస్తితులు వస్తాయి. పైగా అశ్వరావుపేటలో కాంగ్రెస్, సిపిఎం పార్టీలు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఆ రెండు పార్టీలు గాని కలిస్తే మెచ్చాకు కష్టాలు వచ్చినట్లే. పైగా పాత టీడీపీ క్యాడర్ గానీ కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా ఉన్నా సరే మెచ్చా నాగేశ్వరరావుకు నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలవడం కష్టమైపోతుంది.