
జిల్లాలో ఉన్న 10 సీట్లలో 9 సీట్లలో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది...కానీ ఒక్క ఖమ్మం సీటులో పువ్వాడ అజయ్ టీఆర్ఎస్ నుంచి గెలిచి సత్తా చాటారు. ఇలా సత్తా చాటిన పువ్వాడకు కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ విధంగా పువ్వాడ వన్ మ్యాన్ షో నడిచింది. అయితే పువ్వాడ గతంలో వైసీపీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి 2014 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానంలో పోటీ చేశారు.
అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించారు. ఇక తర్వాత తుమ్మల టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అలాగే పువ్వాడ కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2018 ఎన్నికలోచ్చేసరికి పువ్వాడ టీఆర్ఎస్ నుంచి బరిలో దిగి టీడీపీ నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. అయితే నెక్స్ట్ నామా టీఆర్ఎస్‌లోకి వచ్చి ఖమ్మం ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.
ఇటు మంత్రి పదవి దక్కించుకుని పువ్వాడ దూసుకెళుతున్నారు...మంత్రిగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఖమ్మం టౌన్‌ని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నారు. అయితే టౌన్‌లో పలు సమస్యలు ఉన్నాయి...తాగునీరు, డ్రైనేజ్ ఇష్యూలు ఉన్నాయి. పలు కాలనీల్లో ఇంకా పూర్తిగా రోడ్ల సౌకర్యం రాలేదు. రాజకీయంగా చూస్తే పువ్వాడ స్ట్రాంగ్‌గా ఉన్నారు...అటు ప్రత్యర్ధి పార్టీల్లో సరైన నాయకులు లేరు. దీని వల్ల పువ్వాడకు వచ్చే ఎన్నికల్లో గెలవడం కూడా సులువే అని చెప్పొచ్చు.