సీతక్క..ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయక్కర్లేదేమో..రెండు తెలుగు రాష్ట్రాలే కాదు..పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా సీతక్క అంటే ఎవరో తెలుసని చెప్పొచ్చు. అంటే అంతలా ప్రజలకు సేవ చేసి సీతక్క హైలైట్ అయ్యారు. కరోనా సమయంలో అడవులలో ఉంటూ...అనేక ఇబ్బందులు పడ్డ గిరిజనులు, ఆదివాసిలకు ఆమె అండగా నిలబడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైన వారి కోసం నిలబడ్డారు. ఇక సామాన్యురాలుగా ఉంటూ సామాన్య జీవితం గడుపుతున్న సీతక్క..సామాన్య ప్రజల్లోనే ఉంటారు. అందుకే సీతక్కకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇక ఇలాంటి నాయకురాలుకు రాజకీయంగా చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పొచ్చు. ప్రజల మనిషిగా ఉన్న సీతక్కని రాజకీయంగా దెబ్బకొట్టడం సులువు కాదు. ములుగు నియోజకవర్గంలో సీతక్క ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. అయితే సీతక్క రాజకీయాల్లోకి ఎలా వచ్చారు...ఎలా ఎమ్మెల్యే అయ్యారనే విషయం అందరికీ తెలిసిందే. 2004కు ముందు ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు...కొందరు నక్సలైట్లని ప్రజా జీవితంలోకి తీసుకొచ్చారు. అప్పుడు సీతక్కని ప్రజా జీవితంలోకి తీసుకురావడమే కాకుండా...2004లో సీటు కూడా ఇచ్చారు. కానీ అప్పుడు ఓడిపోయారు. అయినా సరే 2009లో మళ్ళీ సీటు ఇచ్చారు. ఇక 2009లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు.

తెలంగాణ వచ్చాక టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైంది..దీంతో 2014లో సీతక్క ఓటమి పాలయ్యారు. నిదానంగా టీడీపీ కనుమరుగైపోతూ ఉండటంతో తప్పనిసరి పరిస్తితుల్లో రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీని వదిలి కాంగ్రెస్‌లో చేరారు. ఇదే క్రమంలో 2018లో ఆమె మళ్ళీ ములుగు నుంచి గెలిచారు. ఇక్కడ నుంచి సీతక్క ప్రజల మనిషిగా మరింత ఎదిగారు. అలాగే రాజకీయ భవిష్యత్ ఇచ్చిన చంద్రబాబు పట్ల ఎప్పుడు గౌరవంతో ఉంటారు. ఇటు రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నారు. సొంత నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇలా ప్రజలకు అండగా ఉండే సీతక్కని ములుగులో ఓడించడం ప్రత్యర్ధులకు సాధ్యం అవ్వని టాస్క్. మరి రాజకీయంగా ఏమన్నా మార్పులు జరిగితే చెప్పలేం గాని..అప్పటివరకు ములుగులో సీతక్క విజయాలని ఆపడం కష్టమే అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: