
అలా విజయాలతో దూకుడు మీదున్న టీఆర్ఎస్‌కు 2020 దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ బ్రేక్ వేశారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోవడంతో దుబ్బాక ఉపఎన్నిక వచ్చింది. ఇక ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌దే విజయమని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ నుంచి బరిలో దిగిన రఘునందన్ అనూహ్యంగా టీఆర్ఎస్‌ని మట్టికరిపించి తొలిసారి..కేసీఆర్‌కు చుక్కలు కనిపించేలా చేశారు.
ఇలా టీఆర్ఎస్‌నే ఓడించిన రఘునందన్ రాజకీయ జీవితం టీఆర్ఎస్‌లోనే మొదలైన విషయం తెలిసిందే. లాయర్‌గా ఉన్న రఘునందన్ 2001లోనే టీఆర్ఎస్‌లో చేరి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అయితే 2013లో రఘునందన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారని చెప్పి, టీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేసింది..దీంతో రఘునందన్ బీజేపీలో చేరారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ తరుపున దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2020 దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్ విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.
ఇక ఎమ్మెల్యేగా రఘునందన్ దూకుడుగానే పనిచేస్తున్నారు...ఓ వైపు టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే...మరోవైపు తనకు టీఆర్ఎస్‌తో ఉన్న పాత పరిచయాలని బట్టి నియోజకవర్గంలో పనులు అయ్యేలా చేసుకుంటున్నారు...దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి అండగా ఉంటున్నారు. రాజకీయంగా కూడా రఘునందన్ ఇంకా బలపడ్డారు...వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి మళ్ళీ రఘునందన్ గెలవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి..ఇక్కడ టీఆర్ఎస్‌కు బలమైన నాయకత్వం కనిపించడం లేదు. ఇటు కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్‌గా లేదు. కాబట్టి మళ్ళీ రఘునందన్‌కు గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది.