
కానీ 2015లో కిష్టారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక 2016లో జరిగింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరుపున మహారెడ్డి భూపాల్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి పట్లోళ్ళ సంజీవ రెడ్డి పోటీ చేశారు. కానీ టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో భూపాల్ రెడ్డి విజయం సాధించారు...అలా తొలిసారి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత సురేష్ షెట్కార్, బీజేపీ నుంచి పట్లోళ్ళ సంజీవ రెడ్డి పోటీ చేశారు.
రెండు పార్టీలని ఓడించి భూపాల్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపాల్ రెడ్డి … నారాయణ్‌ఖేడ్‌లో మంచిగా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు కూడా మెదక్ జిల్లాలోనే ఉండటంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.
అయితే రాజకీయంగా భూపాల్ రెడ్డి బలం కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది...2018 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు నారాయణ్‌ఖేడ్‌లో టీఆర్ఎస్ బలం తగ్గిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ నేత సురేష్ యాక్టివ్ గా ఉన్నారు..పైగా కాంగ్రెస్ సభ్యత్వాలు కూడా ఎక్కువ చేయించారు. మళ్ళీ నారాయణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పొచ్చు. అటు బీజేపీ కూడా బలపడుతుంది. మొత్తానికి కాంగ్రెస్, కమలం పార్టీలతో ఈ సారి నారాయణ్‌ఖేడ్ కారు ఎమ్మెల్యేకు ఇబ్బంది అయ్యేలా ఉంది.