తెలంగాణ రాజకీయాల్లో కాస్త క్రేజ్ ఉన్న నాయకుల్లో మైనంపల్లి హన్మంతరావు కూడా ఒకరు...ఈయన రెండు దశాబ్దాల నుంచి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. మొదట తెలుగుదేశం ద్వారా మైనంపల్లి రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. 1998లోనే టీడీపీలోకి వచ్చి..ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు...ఇక 2008లో రామాయంపేట ఉపఎన్నికలో టీడీపీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు... తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో మైనంపల్లికి టీడీపీ టిక్కెట్ దక్కలేదు. మైనంపల్లి మల్కాజ్‌గిరి సీటు ఆశించారు. కానీ అప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసింది. ఇలా టీడీపీలో టిక్కెట్ దక్కలేదు. దీంతో మైనంపల్లి వెంటనే కాంగ్రెస్‌లో చేరారు.. అయితే కాంగ్రెస్‌లో చేరిన టిక్కెట్ దొరకలేదు. ఒకరోజులోనే ఈయన కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. ఆ వెంటనే టీఆర్ఎస్‌లో చేరడం...మల్కాజ్‌గిరి ఎంపీ సీటు దక్కించుకోవడం జరిగింది.

ఆ ఎన్నికలో మైనంపల్లి...టీడీపీ చేతిలో ఓడిపోయారు. ఇక తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దొరికింది. అలా టీఆర్ఎస్‌లో నిదానంగా బలమైన నాయకుడుగా తయారవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే తాను అనుకున్న విధంగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2018లో ఎమ్మెల్యేగా నిలబడి దాదాపు 73 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఎమ్మెల్యేగా మల్కాజ్‌గిరిలో మైనంపల్లి దూసుకుపోతున్నారు... నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందింది. అలాగే ఇక్కడ ప్రజలతో మైనంపల్లి ఎప్పుడు టచ్‌లోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఇక్కడ మైనంపల్లి చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యారు. ఈయనకు చెక్ పెట్టడానికి బీజేపీ గట్టిగా ట్రై చేస్తుంది. బీజేపీ తరుపున రాంచంద్రరావు పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ మైనంపల్లిని ఓడించడం కష్టమనే చెప్పొచ్చు..మళ్ళీ మల్కాజ్‌గిరిలో మైనంపల్లి సత్తా చాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: