
ఇక 2014లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వార్ నడవగా, విజయం బీజేపీని వరించింది...బీజేపీతో టీడీపీ పొత్తు ఉంది...అందుకే బీజేపీ గెలిచింది. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీల మధ్య ఫైట్ జరగగా, విజయం టీఆర్ఎస్‌ని వరించింది.. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఇలా మూడుసార్లు త్రిముఖ పోరు జరిగింది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి భేతి సుభాష్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు..ఈయన 2001లోనే టీఆర్ఎస్‌లోకి వచ్చారు గాని...2014లో ఉప్పల్ సీటు దొరికింది..అప్పుడు బీజేపీ చేతిలో ఓడిపోయారు.
2018 ముందస్తు ఎన్నికల్లో సీటు దక్కించుకుని సత్తా చాటారు...అలా తొలిసారి ఎమ్మెల్యే అయిన సుభాష్ ఏదో అలా అలా పనిచేసుకుంటూ వెళుతున్నారు..ఎలాగో ఉప్పల్ అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి...కాలనీల్లో తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి...అలాగే డ్రైనేజ్ ఇష్యూ ఉంటుంది...వర్షాకాలం వస్తే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇక ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇలా ఆరోపణలు రావడం ఎమ్మెల్యేకు బాగా మైనస్ అవుతున్నాయి.
ఇదే సమయంలో ఇక్కడ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ దూకుడుగా ఉంటున్నారు..అటు దేవేందర్ గౌడ్ తనయుడు వీరేంద్ర బీజేపీలో చేరడం అడ్వాంటేజ్ అవుతుంది..ఇక్కడ కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది...గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఉప్పల్ డివిజన్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఇక్కడ మళ్ళీ ట్రైయాంగిల్ ఫైట్ జరిగేలా ఉంది...కాకపోతే కారుకు కమలంతోనే కాస్త డేంజర్ అని చెప్పొచ్చు.