కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురించి దేశ రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదనే చెప్పాలి...కింది స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదుగుతూ...కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన కిషన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి పనిచేస్తూ వచ్చిన కిషన్ రెడ్డి...కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగారు. అయితే ఇలా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అవ్వడానికి కారణం ఒక ఓటమి అని చెప్పాలి.

వరుసపెట్టి ఎమ్మెల్యేగా విజయాలు సాధిస్తూ వచ్చిన కిషన్ రెడ్డి గత ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు..2004లో హిమాయత్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్...2009, 2014 ఎన్నికల్లో అంబర్‌పేటలో గెలిచారు. కానీ 2018 ఎన్నికల్లో కూడా ఈయన గెలుస్తారని అంతా అనుకున్నారు..అయితే అనూహ్యంగా 1000 ఓట్ల మెజారిటీతో కిషన్ రెడ్డి...టీఆర్ఎస్ అభ్యర్ధి కాలేరు వెంకటేశం చేతులో ఓడిపోయారు.

అలా ఓడిపోయిన కిషన్ రెడ్డి...2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచి...కేంద్ర మంత్రి అయ్యారు. అప్పుడు ఓడిపోకుండా ఉండుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంతి అయ్యే ఛాన్స్ వచ్చేది కాదని చెప్పొచ్చు. ఇక కిషన్ రెడ్డిపై గెలిచిన వెంకటేశం తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు..అంబర్‌పేటలో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే అనుకున్న మేర వెంకటేశం ప్రజా మద్ధతు పెంచుకోవడంలో సఫలమైనట్లు కనిపించడం లేదు.  ప్రభుత్వ పథకాలు కాలేరుకు ప్లస్ అవుతున్నాయి.

అయితే నెక్స్ట్ కిషన్ రెడ్డి..అంబర్‌పేట బరిలో దిగడం ఖాయమని చెప్పొచ్చు..ఈ సారి మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా కిషన్ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లోనే వెయ్యి ఓట్ల స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు..ఈ సారి మాత్రం మంచి మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు..అటు కాలేరు సైతం మళ్ళీ సత్తా చాటాలని చూస్తున్నారు...కానీ మళ్ళీ గెలవడం అనేది కాస్త కష్టమనే చెప్పాలి..ఈ సారి మాత్రం కిషన్ రెడ్డికి చెక్ పెట్టడం కాలేరుకు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: