అక్కినేని వారసుడు అఖిల్ నటించిన రెండో సినిమా హలో. నాగార్జున సొంతంగా రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో పాటు వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా పేరున్న విక్రమ్ కె.కుమార్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో హలోపై రిలీజ్‌కు ముందే ఎక్కడా లేని హైప్ వచ్చింది. భారీ ఎత్తున ప్రమోషన్లు కూడా ఊదరగొట్టేశారు. తీరా రిలీజ్ అయ్యాక హలోకు జస్ట్ ఓకే టాక్ వచ్చింది. రివ్యూవర్లు కూడా పర్లేదని మంచి రేటింగులే ఇచ్చినా హలో మాత్రం బాక్సాఫీస్ దగ్గర రోజు రోజుకు పూర్తిగా నీరసడిపోయింది.
రెండో వారంలోకి ఈ సినిమాకు అల్లు శిరీష్ ఒక్క క్షణం, సునీల్ 2 కంట్రీస్, సందీప్ కిషన్ సినిమా నుంచి కాస్త పోటీ ఉంది. ఇక నాని ఎంసీఏ మిక్స్‌డ్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ దగ్గర స్టడీగా వసూళ్లు రాబడుతోంది. ఐదో రోజుకే హలో వసూళ్లు ఏకంగా 50 శాతం డ్రాప్ అయ్యాయి. ఏపీ+తెలంగాణలోనే ఏకంగా రూ.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన హలో ఇప్పటి వరకు ఐదు రోజులకు కలుపుకుని కేవలం రూ 10.13 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
హలో వసూళ్లు చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కమర్షియల్ ప్లాప్‌గా మిగిలి పోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా 23 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉన్న ఈ సినిమా అది అందుకోవడం కలే అనుకోవాలి. తొలి సినిమా అఖిల్‌తో ప్లాప్ టాక్‌తో డిజాస్టర్ తెచ్చుకున్న అఖిల్, రెండో సినిమా హలోతో హిట్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్‌గా ప్లాప్ సినిమా చేసినట్లయ్యింది.
‘ హలో ‘ 5 డేస్ ఏపీ+తెలంగాణ షేర్ : ( రూ. కోట్లలో )
నైజాం – 4.04
సీడెడ్ – 1.65
గుంటూరు – 1.02
ఉత్తరాంధ్ర – 1.15
కృష్ణా – 0.77
వెస్ట్ – 0.51
ఈస్ట్ – 0.59
నెల్లూరు – 0.40
------------------------------------
ఏపీ+తెలంగాణ = 10.13 కోట్లు
------------------------------------
రెస్టాఫ్ ఇండియా - 1.0 కోటి
ఓవర్సీస్ - 2.20 కోట్లు