అంటే.. ఎస్పీ బాలు పేరుతో పాటు ఆయన పేరు పక్కన బ్రాకెట్‌లో మరణానంతరం అని రాసి ఉంది. దీనిపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. తన ప్రియమైన సోదరుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ అవార్డు ఎస్పీ బాలుకు అర్హులైన గౌరవమని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఎస్పీ బాలు పేరు పక్కన బ్రాకెట్‌లో మరణానంతరం అని రాసి ఉండటం తనకు ఎంతో బాధను కలగజేస్తోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు బతికి ఉండి తానే స్వయంగా ఈ అవార్డును తీసుకుని ఉంటే ఎంతో బాగుండేదని చిరంజీవి చెప్పారు.
కాగా.. 2021 ఏడాదికి పద్మ విభూషణ్-7, పద్మ భూషణ్-10, పద్మ శ్రీ-102.. మొత్తంగా 119 మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఆర్ట్ కేటగిరీలో తమిళనాడు రాష్ట్రం తరుపున ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మ విభూషణ్ అవార్డ్‌కు ఎన్నికవగా.. మరో ప్రముఖ గాయకురాలు కె.ఎస్. చిత్ర.. కేరళ రాష్ట్రం తరుపున పద్మ భూషణ్‌కు సెలక్ట్ అయ్యారు. ఎస్పీ బాలు, చిత్రతో పాటు మరింత మంది ప్రముఖులకు పద్మ అవార్డులు వరించాయి.