కృష్ణ పెద్ద కూతురు పద్మావతి ఘట్టమనేనిని వివాహం చేసుకున్నారు జయదేవ్.. ఇక ఈమె అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అశోక్ గల్లా కౌబాయ్ గా నటించబోతున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఈ సినిమాకు ఎంపికయింది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తుండగా నరేష్ , సత్య , అర్చన వంటి తదితర నటులు సహాయక పాత్రలు పోషిస్తున్నారు..
ఇకపోతే 2019 లోనే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి వచ్చింది.. ఇక ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను దర్శకధీరుడు రాజమౌళి ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు చాలా గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ హీరో సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను బాగా అలరించిన విషయం తెలిసిందే.. ఇకపోతే అశోక్ గల్లా తాత కృష్ణ మొదటి సారి కౌబాయ్ గా నటించగా ఇప్పుడు మనవడు అశోక్ గల్లా కూడా కౌబాయ్ గా నటించబోతుండడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.