టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'వీరసింహారెడ్డి'. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని ఇంకా అలాగే రవిశంకర్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్, హనీ రోజ్ లు హీరోయిన్లుగా నటించడం జరిగింది. భారీ అంచనాలతో జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, అలాగే ఈ సినిమా టీజర్ ఇంకా ట్రైలర్ వంటివి ప్రేక్షకులను బాగా అలరించడంతో ఈ సినిమాకి విడుదలకు ముందే ఒక రేంజిలో అదిరిపోయే హైప్ ని తెచ్చాయి.అయితే పాత కథనే తిప్పి తిప్పి రొట్ట కొట్టుడు కొట్టడంతో మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.మొదటి వారం ఈ మూవీ సంక్రాంతి పండుగ పేరు చెప్పుకుని బాగా క్యాష్ చేసుకొని భారీ వసూళ్లనే రాబట్టుకుంది. కానీ రెండో వారం నుంచి మాత్రం చాలా స్లోగా కలెక్ట్ చేసింది.ఇక మూడో వారం అయితే చాలా వరకు ఈ సినిమా చేతులెత్తేసింది.


ఒకసారి 3 వారాలకు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని గమనిస్తే.. 'వీరసింహారెడ్డి' సినిమాకి రూ.70 కోట్లు దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.70 కోట్ల పైగా షేర్ ను రాబట్టల్సి.. ఉంది. ఇక 3 వారాలు పూర్తయ్యేసరికి ఈ మూవీ ఏకంగా రూ.74.98 కోట్ల షేర్ ను రాబట్టి ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి రూ.5  కోట్ల దాకా ప్రాఫిట్స్ ను అందించింది. బాలకృష్ణ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది 'వీరసింహారెడ్డి' మూవీ నిలిచింది. నిజానికి ఈ సినిమా బాలయ్య వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. పోటీగా చిరంజీవి, రవితేజ లాంటి పెద్ద స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా వాల్తేరు వీరయ్య సినిమా వున్నా కూడా బాలయ్య ఈ సినిమాని ఒంటి చేత్తో నష్టాలు పాలు కాకుండా చేశాడు. పైగా సంక్రాంతి సీజన్ కూడా బాలయ్యకి కలిసి రావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: