కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తరికెక్కుతుంది. అయితే ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది.. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ అవకాశాన్ని దక్కించుకుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 30 సినిమా కోసం జాన్వి కపూర్ ఇక ఫిక్స్ అయిపోయినట్లే అని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ తో నటించేందుకు జాన్వికపూర్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుందట.
ఏకంగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా కోసం జాన్వి కపూర్ 4 కోట్ల రూపాయల పారితోషకం డిమాండ్ చేసిందట. అయితే ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఇక ఇంత పెద్ద మొత్తంలో పారితోషకం చెల్లించేందుకు కూడా నిర్మాతలు వెనకడుగు వేశారట. అయితే జాన్వీ కపూర్ కెరీర్ లో ఇక ఇదే బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ అన్నది తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఈ అమ్మడి పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతుంది అని టాక్. అయితే ఈ సినిమాతో మొదటిసారి హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టబోతుంది ఈ ముద్దుగుమ్మ దీంతో ఇక ఎలా రానించబోతుంది అన్నది చూడాలి.