టాలీవుడ్ యాంకర్లలో గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఏదైనా ఒక చిన్న పోస్ట్ పెట్టినా సరే ఆ పోస్టు క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది. జబర్దస్త్ షో కి అనసూయ గుడ్ బాయ్ చెప్పడంతో ఆమె అభిమానులలో చాలామందిని ఈ విషయం బాధ పెట్టిందని చెప్పాలి.. వాస్తవానికి అనసూయ కోసమే చాలామంది జబర్దస్త్ షో చూసేవారు అని సమాచారం


ఇకపోతే జబర్దస్త్ ను అనసూయ వదిలి వేయడానికి గల కారణం విపరీతమైన అగౌరవకరమైన టిఆర్పి స్టంట్స్ వల్లే తాను జబర్దస్త్ షోకి దూరం అయ్యాను అంటూ పరోక్షంగా కామెంట్లు చేయగా అవి చాలా వైరల్ అవుతున్నాయి.  రాబోయే రోజులలో మళ్ళీ జబర్దస్త్ షో కి అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడం కష్టంగానే మారింది. అనసూయ తర్వాత కొద్ది రోజులు రష్మీ యాంకర్ గా వ్యవహరించినప్పటికీ కూడా.. ఆ తర్వాత కాలంలో బుల్లితెర నటి సౌమ్యరావ్ ను యాంకర్ గా తీసుకొచ్చారు. సౌమ్య రావ్ కి కూడా పారితోషకం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇకపోతే పలు టీవీ షోలకు అనసూయ దూరం అయినా కూడా.. ఆమె ఈవెంట్లకు పనిచేసే అవకాశాన్ని దక్కించుకోవడంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు , వెబ్ సిరీస్ లంటూ బిజీగా మారింది అనసూయ.

ప్రస్తుతం పుష్ప 2  సినిమాలో మెయిన్ విలన్ గా అనసూయ కనిపిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం పారితోషకం రోజుకు లక్ష రూపాయల రేంజ్ లో అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. రాబోయే రోజుల్లో ఎలాంటి క్రేజీ ప్రాజెక్టులతో మన ముందుకు వస్తుందో చూడాలి ..ఈ క్రమంలోని అటు వెండితెర ఇటు బుల్లితెరపై కూడా అనసూయను అభిమానించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా తన రేంజ్ను పెంచే పాత్రలు ఎంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: