ప్రస్తుతం కరోనా భయంతో అందరు ఎవరికి వారు వారివారి స్థాయిలలో అజ్ఞాతవాసం చేస్తూ ఇళ్ళకు పరిమితం అయిపోతు సంపదతో సుఖ సంతోషాలు ఉండవు అన్న ఆలోచనలకు ప్రభావితం అవుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు వల్ల ఇలాంటి ఆలోచనలు అందరికీ కలుగుతున్నా ‘సిరి’ వెన్నెల లాంటిది.


డబ్బుతో సుఖ సంతోషాలు కొనలేకపోవచ్చు కానీ ప్రతి వ్యక్తికి తన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు ఎంతో అవసరం ఆర్ధిక బాధలు మనిషిని ఎంతో కుంగతీస్తాయి ఒక వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితుల్లోకి ఆర్ధిక బాధలు ఆ వ్యక్తిని తీసుకువెళ్ళిపోతాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు పెరిగినంత మాత్రాన ఒక సామాన్యుడి ఆర్ధిక స్థితి వృద్ధి చెందినట్లు కాదనీ ప్రస్తుతం కరోనా సమయంలో సామాన్యుడు పడుతున్న కష్టాలు చూస్తే అర్ధం అవుతుంది.


మనదేశంలో సంవత్సరానికి 25 కోట్లు తీసుకునే వారి దగ్గర నుండి సంవత్సరానికి 50 వేలు లోపు జీతం తీసుకునే వారు కూడ లెక్కలేనంతమంది ఉన్నారు. మనదేశంలోని పౌరులు అందరికీ మాట్లాడే స్వచ్చ ఉన్నా 70 సంవత్సరాల స్వాతంత్ర్యం దాటిపోయినా ఇప్పటికీ దేశ జనాభాలో 90 శాతం మందికి ఆర్ధిక స్వేచ్చ లేకుండానే తమ జీవితాలను కొనసాగిస్తున్నారు అన్నది వాస్తవం. సంపాదనకు సంపదకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని చాల తెలివిగా బ్యాలెన్స్ చేసుకునే నేర్పు ఉన్న వ్యక్తులు మాత్రమే జీవితంలో ధనవంతులుగా మారుతారు.


ఈవిషయాలను అర్ధం చేసుకోవాలి అంటే ప్రస్తుత మన విద్యా విధానంలో ప్రతి వ్యక్తికి ఆర్ధిక విద్య పట్ల అవగాహన కలిగించాలి. మనదేశ చరిత్ర సంస్కృతి స్వాతంత్రోద్యమం గురించి చిన్నతనం నుండి పాఠ్యాంశాలు ఎలా ఉంటాయో మనీ మేనేజ్మెంట్ గురించి కూడ విద్యార్థి దశ నుండి పిల్లలకు పాఠాలు చెప్పగలిగినప్పుడు కనీసం రేపటి తరానికి అయినా సంపద రహస్యం తెలుసుకుని జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడానికి డబ్బు ఎంత అవసరమో అన్న విషయం తెలుస్తుంది కాబట్టి గురి తప్పని ఆర్ధిక సూత్రాలతో అందరు తమ జీవితాలను ‘సిరి’ వెన్నెల గా మార్చుకుంటారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: