ప్రతి మనిషికి ఎన్నో అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్లు చాల మొండివి. అవి రాత్రికి రాత్రే ఆ అలవాట్ల నుండి బయట పడదాము అంటే జరిగే పనికాదు. ఒక వ్యక్తి రేపు పది వేల రూపాయలు పక్కకు పెట్టాలి అని అనుకునేకన్నా వారానికి ఒక 100 రూపాయలు పొదుపు చేయాలి అనుకోవడం మంచి ఆలోచన.
ఒక వస్తువును మన ఇంటిలోని కిటికీ లోంచి పారవేసినంత సులువుగా ఒక వ్యక్తి తన అలవాట్లను వెంటనే మార్చుకోలేరు. దీనికి ఎంతో కృషి పట్టుదల అవసరం. దీనికితోడు ఒక అలవాటును తప్పించుకోవాలి అనుకుంటే దానిని బుజ్జగించి మన మార్గంలోకి రప్పించుకోవాలి కాని కేవలం మన జీవితంలోంచి వెళ్ళిపొమ్మని మన అలవాట్లను ఆజ్ఞాపిస్తే అవి వెళ్ళిపోవు అని అంటాడు మార్క్ ట్వైన్. ఒక కొత్త అలవాటును చేసుకోవడంలో పదేపదే విఫలం అవుతూ మనలోని పాత అలవాట్లకు మనిషి చాల దగ్గర అవుతూ ఉంటాడు. ముఖ్యంగా మనం విజయం సాధించదానికి అవసరం అయిన ఒక థీరీ గురించి తెలుసుకుందాం.
దీనినే ‘ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకంలో ఈ పుస్తక రచయిత కోవి చాల వివరంగా తెలియ చేసాడు. వాస్తవానికి అలవాట్లకు చాల బలమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ శక్తిని గుర్తించ గలిగినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి తన అలవాట్ల నుండి బయట పడగలుగుతాడు. అందువల్లనే జీవితానికి సంబంధించి విపరీతమైన ఆశలతో ఆశయాలతో ఉంటూ తమ జీవిత లక్ష్యాలను చేరుకోలేని వ్యక్తులు చాల సులువుగా చెడు అలవాట్లకు దగ్గర అవుతారు.
పొదుపు చేసే అలవాటును ఒక అలవాటుగా మార్చుకున్న ఏ వ్యక్తి అయినా చాల సులువుగా ధనవంతుడుగా ఎదగ గలుగుతాడు. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని వెంటనే పొదుపుగా మార్చలేడు. కేవలం మన పై అధికారాన్ని చెలాయించే అలవాట్లను కట్టడి చేయడం ద్వారా మాత్రమే మన అలవాట్లు మనకు లొంగిపోయి మన మనసు పొదుపు వైపు ఆలోచించే దిశగా మార్చగలుగుతాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ముందుగా డబ్బు గురించి ఆలోచించకుండా అలవాట్లను నియత్రించే స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే ఒక సాధారణ వ్యక్తి కూడ సంపన్నుడుగా మారుతాడు..