భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నట్లుగానే మనిషి కూడ ఎల్లప్పుడూ డబ్బు చుట్టూ తిరుగుతాడు. దీనితో మనిషిని అంతగా ప్రభావితం చేస్తున్న డబ్బు ఇంత కీలకంగా మారడానికి ఆరు కారణాలు ఉన్నాయని అంటారు. ప్రతివ్యక్తి తమతమ స్థాయిలలో తమ జీవనం కొనసాగాలని కొన్ని ప్రమాణాలు పెట్టుకుంటారు. ఆ ప్రమాణాలు జీవితాంతం కొనసాగాలి అంటే ప్రతి వ్యక్తికి డబ్బు కావాలి.


కనీసపు అవసరాల నుండి విలాసాల వరకు మనిషి చేసే అన్ని ప్రయత్నాలకు డబ్బు మాత్రమే సూత్రధారి. ఒక వ్యక్తిని క్రియాశీలకంగా మార్చి అతడికి శక్తియుక్తులు కలిగించే శక్తి ఒక్క డబ్బులో మాత్రమే ఉంది. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా మరింత జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్య నియమాలు పాటించినా డబ్బు ఇచ్చే శక్తి మరేశక్తిలో లేదు అన్న విషయం ఆధ్యాత్మిక వేత్తలు కూడ అంగీకరిస్తున్నారు.


ఒక మనిషి మరో మనిషికి సహాయ సహకారాలు చేయాలంటే డబ్బు లేకుండా సాధ్యపడదు. ప్రపంచంలో ఉన్న పేదరికం గురించి మధన పడటంకంటే ఎంతో కొంత మన సమాజంలోని పేదవారికి మనవంతు సహాయ సహకారాలు అందించాలి అంటే తప్పనిసరిగా మనవద్ద డబ్బు ఉండి తీరాలి. ముఖ్యంగా ప్రతివ్యక్తి స్వేచ్చను కోరుకుంటాడు. ఆ స్వేచ్చ కేవలం డబ్బు వల్ల మాత్రమే వస్తుంది. చాలామంది ఆధ్యాత్మిక వేత్తలు డబ్బు శాశ్విత ఆనందాన్ని ఇవ్వడు అని చెపుతూ ఉంటారు. అయితే ఒక మనిషి తనకు నచ్చిన విధంగా స్వేచ్చగా ఉండాలి అంటే ఆ స్వేచ్చ కేవలం డబ్బు మాత్రమే కలిగిస్తుంది.


అదేవిధంగా ఒక వ్యక్తికి గుర్తింపు అతడి సన్నిహితుల నుండి ప్రేమాను రాగాలు పొందేలా చేయగల శక్తి డబ్బుకు మాత్రమే ఉంది. ఒకవిధంగా వ్యక్తుల మధ్య సరైన సంబంధ బాంధవ్యాలు కొనసాగించే విషయంలో కూడ డబ్బుడే ప్రధాన పాత్ర. అందుకే డబ్బు మన భావాలను వ్యక్తిత్వాలను ప్రభావితం చేస్తూ మన జీవన ప్రయాణం కొనసాగించే యాత్రకు ఉపయోగపడే వాహనంగా డబ్బు ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనీ ఎక్స్ పర్ట్స్ అందరు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: