మనిషికంటే చాల చైతన్యవంతమైనది డబ్బు. అయితే ఆ చైతన్యాన్ని గుర్తించకుండా చాలమంది డబ్బును ఒక కాగితపు నోటు లా భావిస్తూ ఉంటారు. వాస్తవానికి డబ్బుకు అనేక సహజ లక్షణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు డబ్బును సంపాదించి ధనవంతులు గా మారాలని ప్రయత్నిస్తున్నా డబ్బుకు ఉన్న ఆ సహజ లక్షణాన్ని తరుచు మరిచిపోతు ఉంటారు. ముఖ్యంగా డబ్బు డబ్బును సృష్టిస్తుంది.


అందువల్ల నిరంతరం ప్రతి వ్యక్తి తన వద్ద ఉన్న డబ్బును ఏమి చేస్తే మరింత అధికంగా మారుతుంది అనే ఆలోచనలు చేయాలి. దీనికోసం మన దగ్గర ఉన్న డబ్బును అత్యంత విలువైనదిగా భావించడమే కాకుండా దానిని నిరంతరం రక్షించుకోగల సామర్థ్యం ప్రతి వ్యక్తికి ఉండాలి. దీనికోసం మన దగ్గర ఉన్న డబ్బును ఎంజాయ్ చేస్తూనే ఆ డబ్బు మనలను దాటిపోకుండా ఎప్పుడు అతి జాగ్రత్తతో ఉండాలి.


అయితే డబ్బును విపరీతంగా జాగ్రత్త పరుచుకుంటూ ఏపని చేయకుండా రోజులు గడిపే వ్యక్తిని ఆ డబ్బు పీనాసిగా మారుస్తుంది తప్ప తెలివైన వాడిగా మార్చదు. వాస్తవానికి తెలివితేటలు లేనివారి దగ్గర డబ్బు కూడ ఉండటానికి ఇష్టపడదు అని అంటారు. ఒక మనిషి జీవితంలో ఎదగాలి అంటే మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో మనీ తో మన బాంధవ్యం కూడ సరైన పద్ధతిలో ఉండటం చాల అవసరం. అందుకే మనీకి ఒక మనిషి ఐక్యూ కి అవినాభావ సంబంధం ఉంది.


డబ్బు సంపాదనను మన ఇంటి పైపులో వచ్చే నీటితో పోలుస్తూ ఉంటారు. పైపు నుండి నీరు ప్రవాహం ల వస్తున్నట్లుగా ధన సంపాదన కూడ ఒక ప్రవాహం లా రావాలి అంటే ఆ డబ్బుతో మనకు ప్రేమతో పాటు ఆ డబ్బును తెలివిగా డీల్ చేయగల తెలివితేటలు కూడ ఉండాలి. దీనితో మనీ కి ఉన్న ఈ ప్రాధమీక లక్షణాలు అన్నీ ప్రతి మనిషి గుర్తించినప్పుడు మాత్రమే ఏ వ్యక్తి అయినా సంపన్నుడు కాగలడు..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: