భారతదేశంలో తొలి కాంటాక్ట్ లెస్ పేమెంట్ వాచీ గా ఈ వాచ్ ఒక కొత్త ఒరవడి సృష్టించింది. ఈవాచ్ సహాయంతో దేశంలోని స్టేట్ బ్యాంక్ కష్టమర్లు తమ డెబిట్ కార్డులను స్వైపింగ్ మిషన్స్ వద్ద స్వైప్ చేసుకోవలసిన అవసరంలేదు. డెబిట్ కార్డ్ ఉపయోగించ కుండానే ఒక సరికొత్త షాపింగ్ అనుభూతి ఈవాచ్ ద్వారా పొందే అవకాశం ఉంది.
టైటాన్ కంపెనీ విడుదల చేసిన ఈకొత్త వాచీ ద్వారా డిజిటల్ లావదేవీలు చాల సులువుగా చేసుకోవచ్చు. అయితే ఈతరహా చెల్లింపుల సహాయం వినియోగించుకోవడానికి కష్టమర్లు ముందుగా యోనోలో రిజిష్టర్ కావాలి. ఈ వాచ్ స్ట్రాప్ లో అమర్చిన టెక్నాలజీ తో కాంటాక్ట్ లెన్స్ పేమెంట్ల సహాయం చేసుకోవచ్చు. 2 వేల వరకు పిన్ నమోదు చేసుకోవలసిన అవసరం కూడ ఉండదు.
ఈ వాచ్ లు 3 వేల నుండి 5 వేల మధ్య దేశంలోని అన్ని టైటాన్ షాపులోను ఉన్నాయి. ఈ వాచీల మోడల్స్ విజయవంతం అయితే అనేక ప్రముఖ వాచీ కంపెనీలు ఇలాంటి వాచీ మోడల్స్ ను ఇండియాలో ప్రవేశ పెట్టే ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు మాత్రమే పరిమితం అయిన ఈ పే వాచ్ లు రానున్న రోజులలో తమ సేవలను మరింత విస్తృతం చేసుకోవడానికి దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంక్ లలోను అనుసంధానం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి..