
ఇలాంటి పరిస్థితులలో ఒక కంపెనీ షేర్ మార్కట్ లో సంచలనం క్రియేట్ చేయడమే కాకుండా తొలిరోజే ఆ షేర్ కొనుక్కున్న వారికి రెట్టింపు పైగా లాభాలు రావడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ టేక్నాలాజీస్ పేరుతో షేర్ మార్కెట్ లోకి లిస్టు అయిన ఈ కంపెనీ షేర్లు మొదటిరోజే 123 శాతం పెరిగి షేర్ మార్కెట్ లో సంచలనంగా మారింది. ఈ షేర్ దూకుడును పసిగట్టిన చాలామంది ఈ షేర్ పై పెట్టుబడులు పెడుతూ కొనడంతో కేవలం ఒకేరోజు ఈ కంపెనీ మార్కెట్ విలువ 5,448 కోట్లు పెరగడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తివేసింది.
ఇటీవల ముగిసిన్ హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు 151 రెట్ల స్పందన రావడంతో ఈ షేర్ పై మార్కెట్ వర్గాలలో మోజు పెరిగి 14,940 పెట్టుబడి పెట్టినవారికి ఒక్కరోజులోనే 33,390 రావడం షాకింగ్ న్యూస్ గా మారింది.
ఈ షేర్ మార్కెట్ లో లిస్టు అయిన మొదటిరోజే 371 రూపాయల వద్ద నిలబడటం బట్టి రానున్నరోజులలో ఈ షేర్ మరింత పెరిగే ఆస్కారం కనిపిస్తోంది. ఈ షేర్ కు సంబంధించి 90 షేర్లను ఒక లాట్ గా నిశ్చయించడంతో పెట్టిన 14,940 పెట్టుబడి ఒకేరోజులో 33,390 గా మారింది. అయితే ఇలాంటి సంఘటనలు మార్కెట్ లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని అన్ని షేర్లు ప్రస్తుత పరిస్థితులలో కూడ ఈవిధంగానే పెరిగిపోతాయి అన్న అంచనాలతో తప్పటడుగు వేయవద్దని మార్కెట్ విశ్లేషకులు మదుపర్లను అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు చేస్తున్నారు..