కొన్ని వారాలుగా దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ లో నిఫ్టి 13 వేల చేరువలోకి వచ్చి కొన్ని అవరోదాలకు లోనవ్వడంతో స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్న వారిని ఆచితూచి అడుగులు వేయవలసిందిగా సూచనలు వస్తున్నాయి. ఈ వారంలో చాలామంది మదుపర్లు లాభాల స్వీకరణ వైపు అడుగులు వేస్తూ ఉండటంతో ఈ వారాంతానికి నిఫ్టీ చిన్నపాటి ఒడుదుడుకులతో తిరిగి 12,600 స్థాయిలో క్లోజ్ అయ్యే ఆస్కారం ఉంది.


దీనికితోడు కొవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి వస్తున్న వార్తలు అంతగా ఆశాజనకంగా లేకపోవడంతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వేష్టర్లు ఊహించినంత వేగంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి ఇప్పటికీ పూర్తిగా ఎంటర్ కాకపోవడంతో స్వల్ప కాలానికి సంబంధించిన ఒడుదుడుకులు రావడం ఈ వారం ఖాయం అని అంటున్నారు. చిన్న మధ్య స్థాయి షేర్లలో కదలికలు రావడంతో చిన్నతరహా మధ్యతరహా మదుపర్లు ఈ వారం చిన్న మధ్య స్థాయి షేర్లను కొనే అవకాశం ఉంది అంటున్నారు.


అయితే ఈ వారం బంగారం విలువ కొంతవరకు స్థిరంగా కొనసాగితే వెండి బాగా డీలా పడటం ఖాయం అనీ అంటున్నారు. లక్ష్మీవిలాస్ బ్యాంక్ సమస్యల కారణంగా మదుపర్లలో ప్రవేటు బ్యాంక్ లపై కొంతవరకు నమ్మకం సన్నగిల్లడంతో ఈ వారంలో చాలారోజులు ప్రవేటు బ్యాంక్ షేర్లలో ఊగిసలాట కనిపించే ఆస్కారం ఉంది.


కరోనా సమస్యల నుండి తేరుకుని నిర్మాణ రంగం మళ్ళీ ఇప్పుడు కోలుకుంటున్న పరిస్థితులలో దేశ వ్యాప్తంగా సిమెంట్ కు బాగా గిరాకీ ఏర్పడింది. దీనితో ఈవారం సిమెంట్ కంపెనీల షేర్లు రాణించే ఆస్కారం ఉంది. అయితే నిఫ్టీ ఎదో విధంగా 13 వేల వద్ద నిలబడి ముందుకు వెళుతుందా లేదా రివర్స్ అవుతుందా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న పరిస్థితులలో స్వల్పకాలిక ఇన్వేష్టర్లు తగు జాగ్రత్తలలో ఉండాలి విశ్లేషకుల సూచన. దీనికితోడు ఈ వారం దేశంలోని కరోనా కేసుల పరిస్థితులను బట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితులు ఆధారపడే ఆస్కారం ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: