బ్యాంకింగ్ రంగంలోకి బడా కార్పోరేట్ కంపెనేలను అనుమతించాలి అన్న ప్రతిపాదన తెర పైకి వచ్చిన కోడి రోజులలోనే ఈ ప్రతి వాదన పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలోకి కార్పోరేట్ గ్రూప్ లను అనుమతించి ఇక రానున్న రోజులలో కార్పోరేట్ బ్యాంక్ లు దేశంలో కనిపిస్తే వేలకోట్లలో అప్పులు తీసుకునే బడా పారిశ్రామిక వేత్తలకు బ్యాంక్ లను అప్పగించినట్లు అవుతుందని ఈ కార్పోరేట్ బ్యాంక్ లు దివాళా తీస్తే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘు రామ్ రాజన్ చేసిన కామెంట్స్ పై ఏక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ఇప్పటికే బ్యాంకింగ్ లైసెన్స్ లలో పైరవీలు జరుగుతున్నాయని బడా పారిశ్రామిక వేత్తలు తమకు ఉన్న పలుకుబడితో లైసెన్స్ లు పొంది తమకు ఉన్న కార్పోరేట్ ఇమేజ్ తో సామాన్య ప్రజల నుండి లక్షల కోట్లల్లో డిపాజిట్లు సేకరించి ఆ తరువాత ఆ బ్యాంక్ లు దివాల తీస్తే ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ పై ఉన్న నమ్మకం సన్నగిల్లి పోతుందని హెచ్చరికలు వస్తున్నాయి. చివరకు బ్యాంకింగ్ వ్యవస్థ పై జనానికి నమ్మకం సన్నగిల్లిపోతే చాల బ్యాంక్ లలో డిపాజిట్లు లేక నగదు కొరత ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


దీనికితోడు గత కొన్ని సంవత్సరాలుగా భారాత్ కార్పోరేట్ రంగంలో వైఫల్యాలు వల్ల అనేక కంపెనీలు ఫెయిల్ అయి డిఫాల్ట్ ఉదంతాలు పెరిగిపోయి లక్షల కోట్లల్లో రాని బాకీలు పెరిగిపోతున్నాయని ఇలాంటి పరిస్థితులలో కార్పోరేట్ బ్యాంక్ ల ఎంట్రీ ఏమాత్రం ఆర్ధిక వ్యవస్థకు మంచిది కాదు అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కార్పోరేట్ కంపెనీలకు వారి వ్యాపారాల అవసరాల కోసం వేల కోట్లల్లో రుణాలు కావాలని బ్యాంక్ లు వారి ఆధీనంలో ఎటువంటి తనిఖీలు పరిశీలనలు లేకుండా రుణాలు మంజూరు అయిపోతాయని దీనితో దేశం పరిస్థితి ఏమిటి అంటూ రఘు రాజన్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఎక్కడిది..

మరింత సమాచారం తెలుసుకోండి: