ప్రముఖ సెల్ ఫోన్ తయారి సంస్థ వివో కు సంబంధించిన అధ్యయన సంస్థ సిఎమ్ఆర్ నిర్వహించిన ఒక లేటెస్ట్ అధ్యయనంలో స్మార్ట్ ఫోన్స్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం 15 నుంచి 45 సంవత్సరాల వయసుగల వ్యక్తులు సుమారు రోజుకు 7 గంటలు స్మార్ట్ ఫోన్ తోనే సహవాసం చేస్తున్నారని ఆ సర్వే వెల్లడించింది.


ఈ 7 గంటల సమయంలో వర్క్ ఫ్రమ్ 75 శాతంమంది బంధు మిత్రులకు కాలింగ్ కోసం 63 శాతం మంది ఓటీటీ సినిమాల కోసం 59 శాతం మంది సోషల్ మీడియాలో 55 శాతం మంది గేమింగ్ లో 45 శాతం మంది ఇలా రోజుకు 7 గంటలు చొప్పున స్మార్ట్ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారని ఆ సర్వే వెల్లడించింది. గతంలో 70 శాతంమంది నిద్రలేవగానే తమకు ఇష్టమైన దేవుడి ఫోటోను తమ అరచేయిని చూసుకుని దినచర్య ప్రారంభిస్తే ఇప్పుడు 84 శాతంమంది నిద్ర లేవగానే తమ ఫోన్ ను చెక్ చేసుకుని కాని తమ దినచర్య ప్రారంభించడం లేదు అన్న విషయాలు ఆ సర్వే తెలియచేస్తోంది.


అంతేకాదు స్మార్ట్ ఫోన్ వినియోగం మానవ సంబంధాలు మానసిక స్థితి పై కూడ ప్రభావాలు చూపెడుతున్నాయని స్మార్ట్ ఫోన్ వినియోగం ఆపేస్తే తాము మూడీగా ఉద్రేకంగా మారిపోతున్నట్లు 74 శాతంమంది వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాము ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న తీరు ఇదే విధంగా కొనసాగిస్తే తమ మానసిక స్థితి శారీరక ఆరోగ్యం కూడ దెబ్బతింటాయని తమకు తెలుసనీ అందువల్ల కనీసం రోజుకు కొంత సేపైనా మొబైల్ ఫోన్ స్విచ్ ఆపెయడానికి ప్రయత్నిస్తున్నట్లు 74 శాతం మంది తెలియచేసారు. మరికొందరైతే సుమారు రెండున్నర నెలలు కొనసాగిన లాక్ డౌన్ పరిస్థితులలో స్మార్ట్ ఫాన్స్ అద్భుతమైన పరికరాలుగా తమకు ఎంతో సహకరించాయని అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగం ఈవిధంగానే కొనసాగితే ప్రజల జీవితాల పై ప్రతికూల ప్రభావం పడటం ఖాయం అని వివో-సిఎమ్ఆర్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: