ఇదేంటి ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకూ ధర పలుకుతున్న గ్యాస్ సిలిండర్ కేవలం 170 రూపాయలకే ఇస్తారా.. ఏంటి జోక్ చేస్తున్నారా..? అని మీరు కూడా ఆలోచిస్తున్నారా..? అవునండీ..నిజమే.. ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తే, వెయ్యి రూపాయల ధర పలుకుతున్న గ్యాస్ సిలిండర్, కూడా కేవలం 175 రూపాయలకే మీ ఇంటికి వస్తుంది. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు పలు ఆన్లైన్ యాప్ లు, వివిధ రకాల ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లను ప్రకటిస్తున్నాయి. ఇక ప్రస్తుతం వివిధ రకాల లావాదేవాలన్ని కూడా ఆన్లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రముఖ పేమెంట్ యాప్ అయిన పేటీఎం వినియోగదారులకు ఊహించని విధంగా ఒక బంపర్ ఆఫర్ను ప్రకటించింది..
ఏకంగా గ్యాస్ బుకింగ్ పై రూ.700 వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. మీరు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ని పొందాలంటే ఈ విధంగా చేయండి.
ముందుగా paytm యాప్‌ను ఓపెన్ చేయండి.
ఆ తర్వాత రీఛార్జ్ అండ్ పే బిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు బుక్ గ్యాస్ సిలిండర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఆ తరువాత మీరు వాడే సిలిండర్ కంపెనీని ఎంచుకోవాలి.
ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా మీ ఎల్‌పీజీ ఐడీని నమోదు చేయాలి. తర్వాత బిల్ పే చేసి సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఇలా బుక్ చేసుకున్న 24 గంటల్లో మీరు రూ.700 వరకు విలువ గల క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డు వస్తుంది. ఈ కార్డును ఏడు రోజుల్లోగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
అయితే మొదటి సారి పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ ఆఫర్ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి..