సాధారణంగా ఇటీవల కాలంలో చాలామంది డబ్బు తో కూడిన వ్యవహారాలను నేరుగా, చేతికి డబ్బులు ఇవ్వకుండా ఆన్లైన్ ద్వారా, అందులోనూ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులను ఇతరులకు పంపిస్తున్నారు. ఇక అంతేకాదు ఏం కావాలన్నా కూడా ఆన్లైన్లో చాలామంది క్రెడిట్ కార్డు వినియోగించే, వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే, చాలామందికి ఈ క్రెడిట్ కార్డు వినియోగించే అలవాటు కూడా ఉంటుంది. ఇందుకు ముఖ్యకారణం మనీ రిటర్న్ వస్తుందని, అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగించేటప్పుడు రివార్డ్ పాయింట్స్ రావడం కూడా జరుగుతుంది.

ఇక ఈ రివార్డ్ పాయింట్స్ ఉపయోగించేవారికి అరుదుగా వేలల్లో డబ్బులు రావడం మనం చూసే ఉంటాం. కానీ ఇక్కడ కోట్లకు కోట్లు రావడం చాలా అరుదు. అయితే ఇక్కడ అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఈ అరుదైన సంఘటనను వాస్తవం చేశాడు. క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని అలవాటుగా మొదలుపెట్టి, ఇక దానిని వృత్తిగా మార్చుకొని, ఏకంగా 2.17 కోట్లు రూపాయలను సంపాదించుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు, ఇతడికి నోటీసులు కూడా జారీ చేసి, దర్యాప్తు చేపట్టడంతో ఇతగాడి సంపాదన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

అమెరికాకు చెందిన కాన్ స్టాంటిన్ - అంకీవ్ ఫిజినెస్ట్ గా పని చేస్తుండేవాడు. నిజానికి ఇతనికి క్రెడిట్ కార్డు వినియోగంతో లభించే క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ అంటే ఎంతో ఆసక్తి. ఈ కారణం చేతనే  ఇక 2009 నుంచి క్రెడిట్ కార్డు వినియోగించడం ప్రారంభించాడు. ఇక సరదాగా మొదలు పెట్టిన ఈ పద్ధతి కాస్త అలవాటుగా మారి, చివరికి వృత్తిగా మారింది. దాంతో లక్షలు లక్షలు సంపాదించడం ప్రారంభించాడు.

అయితే తను ఎలా సంపాదించేవాడు అంటే, ఉదాహరణకు 500 డాలర్ల గిఫ్ట్ కార్డు కొనుగోలు చేస్తే, దాని మీద అతనికి ఐదు శాతం అంటే ఇరవై ఐదు డాలర్ల రివార్డు పొందేవాడు. ఇక దీన్ని ఎన్ క్యాష్ చేసుకోవాలంటే $6 చెల్లించాలి. ఇక 25 లోనుంచి $6 చెల్లిస్తే, అతడి దగ్గర $19 మిగిలిపోతాయి. ఇక ఇదే అతనికి వచ్చే ఆదాయం. అలా వచ్చిన రివార్డుల ద్వారా అతడు మూడు లక్షల డాలర్లకు పైగా సంపాదించాడు ఇప్పుడు మన కరెన్సీ విలువ 2.17 కోట్ల రూపాయలు.. ఇక ఈ వార్త తెలుసుకున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు అతడికి నోటీసులు కూడా జారీ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: