
ఇక ఆధార్, పాన్ కార్డులైన ఈ రెండు గుర్తింపు పత్రాలను అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం చివరి తేదీని పొడిగించడం ఇది మూడవసారి కావడం విశేషం. మొదట, చివరి తేదీని మార్చి 31, 2021 గా నిర్ణయించారు, తరువాత రెండవ సారి దీనిని జూన్ 30, 2021 వరకు పొడిగించారు. ఇక ఇప్పుడు,కరోనా మహమ్మారి వల్ల ఉపశమనం ఇవ్వడానికి గడువును మళ్ళీ మూడు నెలలు పొడిగించారు.ఒకవేళ పాన్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానించబడకపోతే, అది పనిచేయకపోవచ్చు అంతేగాక ఆలస్య రుసుము 1,000 రూపాయలను పే చెయ్యాలి. ఇక ఆదాయపు పన్ను రిటర్నులు లేదా ఐటిఆర్‌లను దాఖలు చేయడం వంటి ఆదాయపు పన్ను సంబంధిత కార్యకలాపాలను పూర్తి చేయడానికి పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి.కాబట్టి తప్పకుండా పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చెయ్యండి.ఆధార్ - ప్రత్యేక గుర్తింపు సంఖ్య అని కూడా పిలుస్తారు, ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా యుఐడిఎఐ జారీ చేసిన 12-అంకెల సంఖ్య, అయితే పాన్ అనేది 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్, ఇది ఆదాయపు పన్ను విభాగం కేటాయించింది. పాన్ కోట్ అవసరం ఉన్న చోట ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయడానికి పాన్ కార్డ్ అవసరం.