ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు అన్న విషయం అందరికి తెలిసిందే. ముఖ్యమంత్రి కాకముందు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను, తాను సీఎం అయిన వెంటనే తీరుస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తను రాసుకున్న మేనిఫెస్టోలో నవరత్నాలను కూడా ప్రవేశపెట్టి విద్యార్థులకు, మహిళలకు, వృద్ధులకు, రైతులకు ఇలా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదివరకే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన అక్క చెల్లెమ్మలకు తమ అకౌంట్లో 18,750 రూపాయలు జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వైయస్సార్ కాపు నేస్తం కింద 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన అక్కాచెల్లెళ్లకు 15 వేల రూపాయలను తమ అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించింది జగన్ ప్రభుత్వం..
పూర్తి వివరాల్లోకి వెళితే, నవరత్నాలలో ఒక భాగమైన వైయస్సార్ కాపు నేస్తం కింద అర్హులైన అక్క చెల్లెమ్మలకు, రూ.15 వేలు వారి అకౌంట్ లోకి నేరుగా జమ చేస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో అర్హత కలిగి ఉన్న కాపు, ఒంటరి ,బలిజ సామాజికవర్గానికి చెందిన మహిళలు 2021 - 2022 సంవత్సరానికిగాను వైయస్సార్ కాపు నేస్తం కింద, దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ వి ఎస్ సుబ్బలక్ష్మి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. మీ పరిధిలో ఉన్న వాలంటీర్లు ఈ పథకం కోసం సంప్రదించాలని ఆమె సూచించారు ఇక జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ పథకానికి కావలసిన సంబంధిత ధృవ పత్రాలను వాలంటీర్ వద్దకు తీసుకెళ్లి ఈ కేవైసీ చేయించాలని కోరారు.
ఇక జులై 24వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.15 వేల చొప్పున వైయస్సార్ కాపు నేస్తం కింద ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు తమ బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని తెలిపారు.