
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ పథకంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కూడా చేయవచ్చు. ఇక ఈ పథకం లో చేరడం వల్ల ఆడపిల్లల యొక్క ఉన్నత చదువులకు, పెళ్ళిళ్లకు వంటి ఎన్నో అవసరాలకు డబ్బు ఉపయోగపడుతుంది.. ఇక ఈ పథకం లో చేరాలనుకునే ఆడపిల్లల వయసు విషయానికి వస్తే.. 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలు ఈ పథకంలో చేరాలి.. ముఖ్యంగా ఈ పథకం స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కాబట్టి అధిక వడ్డీ రేటు కూడా పొందవచ్చు.. మనం కట్టే డబ్బులకు ఎంత వడ్డీ వస్తుంది.. అని చూస్తే 7.6 శాతం వడ్డీ లభిస్తుంది..
డబ్బులు తిరిగి ఎప్పుడు వెనక్కి ఇస్తారు అని అడిగితే.. అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవచ్చు.. ఈ పథకంలో చేరడానికి కూడా ఎవరూ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులకు వెళ్లి ఈ స్కీమ్ గురించి తెలుసుకుని చేరవచ్చు.. ఈ పథకంలో సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.. ఇక మీరు నెలకు ఎంత కట్టాలి అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు మీరు నెలకు 12,500 రూపాయలు కట్టినట్లయితే మెచ్యూరిటీ తర్వాత సుమారుగా రూ.65 లక్షల వరకు వస్తాయి..
ఒకవేళ నెలకు ఐదు వేలు చొప్పున కట్టినట్లయితే రూ. 25 లక్షలు పొందవచ్చు. ఏదిఏమైనా అమ్మాయికి 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే మీ చేతికి డబ్బులు తీసుకోవచ్చు.