
ఇక ఈ వడ్డీ రేట్లపై కోత విధించిన బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ వడ్డీ రేట్లపై 6.5% తగ్గించడం జరుగుతుంది. అంతేకాదు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నట్లయితే 632 రూపాయలని ఈఎమ్ఐ కింద కట్టుకొని వెసులుబాటును కూడా ఈ బ్యాంక్ కల్పించింది. ఇకపోతే కార్ లోన్ తీసుకునేవారికి 6.85% వడ్డీరేట్లు మొదలవుతాయి. ఇప్పటివరకు బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ పై 6.85 శాతం వడ్డీ రేటు ఉండేది. పోయిన సంవత్సరం వెహికల్ లోన్ పై వడ్డీ రేటు 7.35 శాతం పైగానే వుండేది. కానీ ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ కింద కార్ లోన్ తీసుకునే వారికి 6.85శాతం మాత్రమే వడ్డీతో లోన్ లభిస్తుంది.
దీపావళి పండుగ ఆఫర్ సందర్భంగా అక్టోబర్ 18 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలు కానున్నాయి అని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ నెల చివరి వరకు ఇదే వడ్డీ రేట్లు కొనసాగుతాయని తెలిపారు.. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా ఉంటుంది. ఎవరైనా సరే హోమ్ లోన్ లేదా వెహికల్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో అలాంటివాళ్లు బ్యాంక్ ఆఫ్ బరోడా లో సంప్రదించి లోన్ తీసుకునే వెసులుబాటు పొందవచ్చు.