ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికీ మందుబాబులకు భారీ షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు దశలవారీగా మద్యనిషేధ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.. అంటే ఈ మద్య నిషేధం కార్యక్రమంలో భాగంగానే ఇప్పటికీ లిక్కర్ పై ఎన్నో రకాల ఆంక్షలను విధించి కట్టుదిట్టం చేస్తోంది.. మద్యానికి దూరం కావడానికి చేయవలసింది అంతా చేసి వాటి రేట్లను కూడా రెట్టింపు చేసింది. ప్రస్తుతం గుట్కా, పాన్ మసాలా వంటి వాటిపై కూడా నిషేధం విధించడానికి నిర్ణయాలు తీసుకుంటోంది.

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఎటువంటి మారక ద్రవ్యాలను తయారు చేసినా, విక్రయించినా శిక్ష తప్పదు అంటూ హెచ్చరిస్తోంది. అంతేకాదు దీని కోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకురావాలని ఇప్పటికే ముసాయిదా బిల్లును జగన్ సర్కార్ రూపొందించినట్లు సమాచారం.. తాజాగా ఈ ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నవంబర్ 18 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడానికి జగన్ సర్కార్ సిద్ధమవుతోంది..

ఇప్పటికీ గుట్కా, జర్దా, పాన్ మసాలా వంటి హానికర పదార్థాలను దేశంలో పలు రాష్ట్రాలు నిషేధించాయి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు నిషేధం దిశగా చర్యలు తీసుకున్నాయి.. పశ్చిమ బెంగాల్ అయితే ఒక సంవత్సరం పాటు వీటిని బ్యాన్ చేసింది. ఇక ఉత్తర ప్రదేశ్ ,బీహార్ , ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా తయారీ , అమ్మకాలపై కఠిన ఆంక్షలు విధించాయి.. తాజాగా జగన్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడానికి అన్ని సిద్ధం చేసింది..


ముఖ్యంగా బడాబాబుల నుంచి సాధారణ కార్మికులు సైతం వీటిని వాడుతుంటారు.. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి అని తెలిసినప్పటికీ వారు దానిని మానుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నోటి క్యాన్సర్ తో మరణిస్తున్న వారి సంఖ్య కూడా రాష్ట్రంలో ఎక్కువ అవుతోంది..అందుకే జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: