ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది.. అయితే మరీ అత్యవసర పరిస్థితిలో డబ్బు అవసరం ఏర్పడినప్పుడు ఎక్కడ ఎంత ప్రయత్నించినా మనకు డబ్బు అందుబాటులో లేకపోయేసరికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులలో డబ్బు దొరకనప్పుడు మనకు ఎస్బిఐ బ్యాంక్ లోన్ ఇస్తామని ప్రకటించింది. దేశీయ దిగ్గజం బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల యొక్క కష్టాలను అర్థం చేసుకొని ఇలాంటి ప్రకటన ఇవ్వడం ప్రస్తుతం అందరికీ ఆనంద యోగ్యంగా అనిపిస్తోంది..


ఇందుకోసం ఒక సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఇప్పటికే ఎస్ బీ ఐ, తమ కస్టమర్లకు బ్యాంకుకు సంబంధించిన పనులను సులభతరం చేయడానికి yono యాప్ ను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. అయితే వెంటనే వ్యక్తిగత రుణాలు పొందడానికి తాజాగా  SBI ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ను ప్రవేశపెట్టింది. sbi yono యాప్ ద్వారా మీరు ఈ సేవను పొందవచ్చు.అయితే మీకు  అత్యవసరంగా డబ్బులు అవసరం వచ్చినప్పుడు మొబైల్ ఫోన్ లో డోన్ లోడ్ చేసుకున్న యోనో యాప్‌లో నాలుగు క్లిక్‌లతో మీరు  పర్సనల్ లోన్ అందించనున్నట్లు sbi పేర్కొంది


PAPL  అనగా ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ను 24 గంటలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటుందని sbi తెలిపింది. ముందస్తు సమాచారం కోసం  కస్టమర్లను ఎలాంటి ప్రశ్నలు అడగకుండా.. మంచి క్రెడిట్ హిస్టరీ  ఉన్న వాళ్లను ఎంపిక చేసి.. ఎస్ బీ ఐ లోన్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇకపై డాక్యుమెంట్లు, ఎంక్వరీలు లేకుండానే నేరుగా  ఖాతాదారుల అకౌంట్లో జమ చేయనున్నట్లు పేర్కొంది. ఆసక్తి కలిగిన  SBI కస్టమర్‌లు 567676కు "PAPL" అని మెసేజ్ చేసి, తద్వారా ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌లకు అర్హులు అవునో కాదో అని చెక్ చేసుకోవచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా sbi మరో ఆఫర్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ కింద  లోన్ తీసుకోవాలనుకునే వారు.. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: