కేంద్ర బడ్జెట్ తేదీ సమయం దగ్గరపడుతుండడంతో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా లెక్కలు వేస్తోంది. దేశంలోనే పన్ను చెల్లింపు దారులకు బడ్జెట్ ప్రకటనల కోసం ముఖ్యంగా ఆదాయపు పన్ను కు సంబంధించి ఒక ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకపోతే చెల్లింపుదారులు ఎప్పటినుంచో ఈ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. ఎందుకంటే గత బడ్జెట్ లో ఆదాయపు పన్ను కు సంబంధించి ప్రభుత్వం పెద్దగా ఎలాంటి ప్రయోజనాలను ప్రకటించలేదు. అందుకే పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇక ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిమితిని 35 శాతానికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2022- 23 ఫిబ్రవరి 1 ఉదయం 11గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే ఆదాయపు పన్ను లో మార్పుల కోసం పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా పన్ను ఎవరైతే చెల్లిస్తున్నారో వారికి కొంత ఉపశమనం కల్పించాలి అని ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.. నిజానికి చాలామంది పరిశ్రమ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పన్ను చెల్లింపులో పరిణితి పెంచాలని విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక ఈ నేపథ్యంలోనే పన్ను చెల్లింపుదారులకు సంబంధించి విడుదలైన నివేదికల ప్రకారం ఉపాధి కూలీలకు ఊరట కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తల పట్టుకుంటోంది.


2022 లో బడ్జెట్ లో  కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో ప్రస్తుతమున్న స్టాండర్డ్స్  పరిమితిని 30 నుంచి 35 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని ఒక నివేదికలో వెల్లడయ్యింది. ఇంతకుముందు పన్ను చెల్లింపుదారుల స్టాండర్డ్ పరిమితి రూ. 40,000 ఉండగా దానిని రూ.10,000 పెంచుతూ మొత్తం రూ.50,000 చేశారు. ఇక 2019లో మధ్యంతర బడ్జెట్ ను సమర్పిస్తున్నప్పుడు పీయూష్ గోయల్ రూ. 50 వేలకు పరిమితిని పెంచిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ పరిమితిని మరింత పెంచాలని కోరడంతో ఆర్థిక శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నట్లు అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఎంత పెంచారు అనే విషయాన్ని కూడా తెలియజేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: