ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు 15 సంవత్సరాల వరకు పొదుపు చేసుకోవచ్చు. తర్వాత మీకు డబ్బులు అవసరం లేకపోతే అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు లేదా పొడిగించుకోవచ్చు.. ముఖ్యంగా ఈ పథకంలో మీరు మరో ఐదు సంవత్సరాల పాటు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.. మీకు ఈ పథకం ద్వారా 7.1 శాతం వడ్డీ తాజాగా లభిస్తోంది. ప్రతి సంవత్సరం మీరు 1.5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు ముగిసేసరికి రూ. 41 లక్షలు వస్తాయి. అదే గనుక ప్రతి రోజూ 250 రూపాయల చొప్పున జమ చేసినట్లయితే 15 సంవత్సరాలు ముగిసేసరికి రూ. 62 లక్షలు వస్తాయి.
రోజుకు 50 రూపాయల చొప్పున అంటే 30 రోజులకు 7500 రూపాయలు..అదే 365 రోజులకు రూ.91,250 జమ చేయాల్సి ఉంటుంది. ఇక ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుంచి మీరు పొదుపు చేయడం ప్రారంభిస్తే 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి నెల డబ్బులు పొదుపు చేస్తే.. మొత్తం 22 లక్షల రూపాయలకు పైనే అవుతుంది. మొత్తం మీకు రూ. 62.5 లక్షల రిటర్న్స్ కూడా వస్తాయి. 500 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది.