30 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన భార్యాభర్తలిద్దరూ ఈ అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరడానికి అర్హులు. ఇక 60 సంవత్సరాలు వచ్చిన తరువాత ఈ పథకం ద్వారా ప్రతి నెల ఒక్కొక్కరు 10 వేల రూపాయల చొప్పున విడివిడిగా పొందే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇందుకోసం మీరు ప్రతి నెల రూ. 577 రూపాయలను ఒక్కొక్కరు విడివిడిగా రెండు ఖాతాలను ఓపెన్ చేసి జమ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ప్రతి నెల ఎంత పెన్షన్ పొందాలి అనుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు జమ చేసే ప్రాతిపదిక మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.
అయితే ఈ పథకంలో భార్యాభర్తలు మాత్రమే కాదు 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న ఏ పౌరుడు అయినా సరే ఈ పథకంలో చేరవచ్చు. అయితే కేవలం నెలకు రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000 లేదా రూ.5000 ఇలా వీటిలో మీరు ఎంత పొందాలి అనుకుంటున్నారో ఆ ప్రాతిపదిక మీద మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నెలకు 210 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వల్ల 60 సంవత్సరాల తర్వాత ఐదు వేల రూపాయల పెన్షన్ కూడా మీరు పొందే ఆస్కారం వుంటుంది. అయితే 18 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈ పథకం లో చేరడం వల్ల 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ కింద పొందుతారు.