ప్రస్తుతం మన భారతదేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని.. అంతేకాదు వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించి చలామణిలో ఉంచింది అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తాజాగా వెల్లడించడం జరిగింది. ఇకపోతే పది రూపాయల నాణేలు నకిలీ వి అన్న ఉద్దేశంతోనే దేశంలో చాలా ప్రదేశాలలో చెల్లుబాటు కావడం లేదా.. లేక వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏదైనా చర్యలు తీసుకుంటోందా అని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే సభ్యుడు ఏ విజయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇవ్వడం జరిగింది.


ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది రూపాయల నాణేలు వివిధ సైజులలో.. ఇతివృత్తాలలో.. డిజైన్లలో ముద్రించడం జరిగింది. ప్రస్తుతం అవన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి.. వీటిని అన్ని రకాల లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాధారణ ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు ఏమిటంటే దుకాణ యజమానులు తీసుకోవడం లేదు అని.. అలాంటి వారిలో అవగాహన కల్పించడానికి.. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి వారిలో ఉన్న అపోహలను తొలగించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ వస్తోంది..


అంతేకాదు ఈ పది రూపాయల నాణేలను అనుమానం లేకుండా అన్ని లావాదేవీలలో ఉపయోగించవచ్చునని అంతేకాదు ఇందు కోసం దేశవ్యాప్తంగా ఎస్ఎంఎస్ రూపంలో అవగాహన ఉద్యమం నిర్వహిస్తోంది అని ఆయన స్పష్టం చేశారు.. ఇక అంతే కాదు పది రూపాయల నాణేలు తీసుకోవడం లేదన్న కారణంతో కేసులు దాఖలైన అంశం అయితే ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు అని కేంద్ర సహాయ మంత్రి స్పష్టం చేశారు. కాబట్టి ఇకపై కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం మేరకు పది రూపాయల నాణేలను అన్ని లావాదేవీలలో ఉపయోగించవచ్చునని స్పష్టం చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: