సాధారణంగా షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలామంది ఆలోచిస్తారు ఎందుకంటే రిస్కు ఉంటుంది పైగా డబ్బులు వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనుగోలు చేయాలి..అందుకే చాలామంది భయపడుతుంటారు. కాబట్టి కొనేటప్పుడు ఆచితూచి అడుగు వేస్తూ .. పెద్ద పెద్ద కంపెనీలు.. తప్పకుండా రాబడిని అందించే షేర్లను మాత్రమే కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక నష్టం లేకుండా అతి తక్కువ సమయంలోనే మన డబ్బును అధికంగా ఉండవచ్చు.. ఇప్పుడు వచ్చిన మల్టీ బ్లాగర్ లో ఒక షేర్ రూ. లక్షకు రూ.82 లక్షల ను తెచ్చిపెట్టింది..
ఇప్పుడు వచ్చిన సరికొత్త షేర్ గురించి మనం తెలుసుకుందాం.. సింధు ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ కూడా ఒకటి.. కాబట్టి ఇది ఇన్వెస్టర్లకు మంచి లాభాలను సంపాదించిపెట్టింది అంతేకాదు ఎంతలా అంటే పెట్టిన ఇన్వెస్టర్ కు కళ్ళు చెదిరిపోయే లాభాలను అందించి వారిని ఒక్కసారిగా లక్షాధికారి గా మార్చేసింది. ఈ షేర్ ఒక్క దాని విలువ కేవలం ఐదు రోజుల్లోనే రూ. 121 పెరిగింది.. అంటే ఈ షేర్ కొన్నప్పుడు ఎంత ఉంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం.. పోయిన సంవత్సరం అనగా 2021 ఆగస్టు 7వ తేదీన ఈ షేరు విలువ ఒక్కొక్కటి రూ.9.70 వద్ద ఉండగా ప్రస్తుతం కేవలం ఏడు నెలలు ముగిసేసరికి దీని ఒక్కొక్క షేర్ విలువ రూ.139.75 గా మారింది.. నిజానికి ఆగస్టు నుంచి జనవరి మాసం ముగిసే వరకు ఈ షేరు తటస్థంగా ఓకే దగ్గర ఉండిపోయింది కానీ కేవలం 5 రోజుల్లో ఇలా మారిపోవడం అని చెప్పవచ్చు.
ఇక పోతే మరో రెండు రోజుల క్రితం ఈ షేరు విలువ రూ.140 స్థాయిలను అందుకోవడం గమనార్హం ఈ స్వల్పకాలంలోనే 1350 శాతం రిటర్న్స్ రావడం గమనార్హం. ఇకపోతే గత ఐదు సంవత్సరాల క్రితం ఈ షేరు విలువ రూ.1.69 గా నమోదయింది. ఇక ఇదే గనుక మీరు గత ఐదు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఇప్పుడు దాని విలువ రూ.82 లక్షలు గా నమోదు అయి ఉండేది.