సాధారణంగా భర్త ఎల్ఐసి జీవిత బీమా కట్టినా.. లేదా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ మెంట్ ఫండ్స్.. ఇలా అన్నీ..ఆయన మరణిస్తే ఆయన మరణానంతరం జీవిత బీమా డబ్బులు ఆయన భార్యకు వర్తిస్తాయి.. అయితే ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వార్త ఏమిటంటే ఆ భర్తకు ఇద్దరు భార్యలు ఉంటే మరి రెండవ భార్యకు పెన్షన్ వర్తిస్తుందా లేదా అనే విషయం సంచలనంగా మారింది. ఇకపోతే ఈ విషయంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ విషయం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఒక వ్యక్తి మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా రెండవ భార్య ను వివాహం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి మరణానంతరం అతడి జీవిత బీమా డబ్బులు మొదటి భార్యకు మాత్రమే చెందుతాయని,  రెండవ భార్యకు చెందే అవకాశమే లేదు అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపోతే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం తనకు పెన్షన్‌ ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ.. సోలాపూర్‌కు చెందిన శామల్‌ తాటే  పిటిషన్‌ దాఖలు చేసింది.. అయితే ఆమె దాఖలు చేసిన పిటిషన్  చెల్లదని హైకోర్టు కొట్టివేసింది. ఇదిలా వుండగా  1996లో మరణించిన ఆమె భర్త మహాదేవ్‌ తాటే.. సోలాపూర్‌ కలెక్టరేట్‌లో ప్యూన్‌గా పనిచేసేవారు. అయితే శామల్‌ అనే ఆవిడ అతడికి రెండో భార్య. ఆ మృతుడి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌లో 90 శాతం మొదటి భార్య తీసుకొగా.. నెలవారీ పింఛన్‌ రెండోభార్యకు ఇచ్చేలా వారి మధ్య అంతర్గత ఒప్పందం కూడా  కుదిరింది. నిజానికి ఆ మృతుడికి సంబంధించిన అన్ని లావాదేవీలు కూడా మొదటి వారికే చెందుతాయి కానీ రెండవ భార్య అన్యాయం అవ్వకూడదు ఆలోచనతో మొదటి భార్య ఈమెకు నెలవారి పెన్షన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.


ఆ మృతుడి మొదటి భార్య కూడా  క్యాన్సర్‌తో చనిపోయిన తర్వాత.. మృతుడి భార్య కు వచ్చే ఫన్నీ పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగింది కానీ రెండోభార్య  శామల్‌ తనకు నెలవారీ పెన్షన్‌ చెల్లించాలని 2007 నుంచి 2014 మధ్యకాలంలో నాలుగుసార్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది..కానీ  వాటిని ప్రభుత్వం తిరస్కరించడంతో ఆమె హైకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయం సరైనదేనంటూ శామల్‌ పిటిషన్‌ను కొట్టివేసి, ఇకపై ఎవరైనా సరే మొదటి భార్య విడాకులు తీసుకోకుండా రెండవ భార్యకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు అని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: