అవే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లు.. సుకన్య సమృద్ధి యోజన పథకం మాదిరి చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా పిల్లల భవిష్యత్తుకు.. పెళ్ళిళ్ళకు.. చదువులకు ఇలా వారిఅవసరాల కోసం ముఖ్యంగా ఆర్థిక అవసరాలను ఈ ప్లాన్స్ తీరుస్తూ ఉంటాయి. ఇక వీటివల్ల పిల్లలకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటే ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా ఎప్పుడైనా సరే అనుకోని ప్రమాదంలో తల్లిదండ్రులు మరణిస్తే ఆ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కంటిన్యూ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించబడింది..
ఇక PEB ప్రీమియం మినహాయింపు ఆప్షన్ కూడా లభించడం జరిగింది. ఇకపోతే ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ మీరు ఆడపిల్లలు లేదా మగ పిల్లలు ఇద్దరి కోసం కూడా తీసుకోవచ్చు.. మెచ్యూరిటీ కూడా తల్లిదండ్రులు ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. సుకన్య సమృద్ధి యోజన పథకం లాగే ఈ చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో కూడా పెట్టుబడులు పెట్టడం వల్ల సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.. అంతే కాదు పెట్టిన పెట్టుబడికి కొన్ని పదుల రెట్ల డబ్బులు లభించడం గమనార్హం. ఏది ఏమైనా పిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్లాన్లో ప్రతి ఒక్కరికీ ఆనందదాయకమని చెప్పవచ్చు.