ఇక ఇది సీనియర్ సిటిజన్లకు భద్రత కల్పిస్తుందని చెప్పవచ్చు. 60 సంవత్సరాలు దాటిన వారికి ఈ పథకంలో చేరే అర్హత లభిస్తుంది. మీరు గనక ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే సుమారుగా పది సంవత్సరాల పాటు పింఛన్ కు హామీ కూడా ఉంటుంది. ప్రస్తుతం దీన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది కాబట్టి.. వార్షిక వడ్డీ రేటు కూడా 7.40 శాతానికి అందిస్తోంది. ఇకపోతే ఈ పథకంలో చేరడానికి మొదట 2020 మార్చి 31 మాత్రమే గడువు ఉండగా ప్రస్తుతం దానిని 2023 వరకు పొడిగించడం జరిగింది.
ముఖ్యంగా ఈ స్కీం కింద రూ.15 లక్షలు గరిష్ట పరిమితి కింద పెట్టవచ్చు. నెలవారీ పెన్షన్ రూ. 10,000 పొందాలి అంటే పది సంవత్సరాల పాటు సంవత్సరానికి 8 శాతం తో కూడిన వడ్డీ కూడా లభిస్తుంది. ఇకపోతే ఈ పథకం కింద మీరు ఏడాదికి 12 వేల రూపాయల పెన్షన్ పొందాలి అంటే కనీస పెట్టుబడి 1,56,658 రూపాయలను పెట్టుబడిగా పెట్టాలి. ప్రస్తుతం మీరు పది సంవత్సరాలకు గాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వదిలేస్తే ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలను పెన్షన్ కింద పొందే అవకాశం ఉంటుంది