సాధారణంగా మంచి నూనె లేని వంటగది ఎడారి తో సమానం అని అంటూ ఉంటారు నిపుణులు.. ముఖ్యంగా నూనె లేని వంటకాలు మనకు అసలే లోపలికి రుచించవు. కాబట్టి నూనె వేసి చేసిన వంటలు మాత్రమే అందరూ తింటూ ఉంటారు. అయితే తాజాగా ఉక్రెయిన్ - రష్యా మధ్య జరిగిన యుద్ధం వల్ల వంటనూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ధరలు పెరిగినా.. తగ్గినా చాలా కాలం పాటు పొందడానికి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదే నూనె మిల్లు ఏర్పాటు.. దీని వల్ల లాభాలు తప్ప నష్టాలు అయితే ఎక్కడా ఉండవు. ముఖ్యంగా దీనిని ఎలా ప్రారంభించాలి ఎంతవరకు లాభాలు వస్తాయి అనే విషయానికి వస్తే.. ముఖ్యంగా మన దేశంలో వంట నూనెలకు సంబంధించి నూనె మిల్లులు ఎన్ని పెట్టినా సరే నష్టం అయితే వాటిల్లదు.


 ఇకపోతే ఆవాల నుంచి వేరుశెనగ వరకు.. కొబ్బరి నుంచి ప్రొద్దుతిరుగుడు వరకు వివిధ రకాల నూనెలను ఉత్పత్తి చేసే చిన్న స్థాయి నుంచి మొదలు పెట్టవచ్చు. ఈ వ్యాపారానికి మీకు కావలసింది ముఖ్యంగా ఎక్స్ పెల్లర్ ఆయిల్ మెషిన్ మాత్రమే అవసరమవుతుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు సుదీర్ఘకాలంపాటు లాభాలను ఈ బిజినెస్ ద్వారా మీరు పొందవచ్చు. ముందుగా ఎలాంటి ఆయిల్ మిల్లు వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారో ఆలోచించి ఎలాంటి నూనెను ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు అందుకు తగ్గట్టుగా ఆయిల్ ఎక్స్ పెల్లర్ యంత్రాన్ని కొనుగోలు చేయాలి. ఆవాల నూనె తీసే మిల్లు అయితే ఖరీదు రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది. తరువాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మీరు లైసెన్స్ పొందాలి.


 పూర్తిస్థాయిలో ఆయిల్ మిల్లు ఏర్పాటు చేయడానికి మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది.  అయితే ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెడతారు కాబట్టి దీర్ఘకాలం లాభం పొందవచ్చు ముఖ్యంగా డబ్బాలు లేదా సీసాలలో ప్యాక్ చేసి కస్టమర్లకు కూడా సేల్ చేయవచ్చు. కొద్ది నెలల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: