ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన వారికి కోటక్ బ్యాంకు తాజాగా శుభవార్త తీసుకొచ్చింది. ఈ కొత్త రేటు ఇప్పటికే అమలు లోకి రావడం గమనార్హం. డబ్బులను బ్యాంకు లో దాచుకోవాలని భావించేవారు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. గతం లో  పోల్చుకుంటే ఇప్పుడు కాస్త వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. టేన్యుర్ ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ కూడా మారుతుంది అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. అందువల్ల డబ్బు లు పెట్టేటప్పుడు టెన్యుర్ కూడా మీరు గమనించాల్సి ఉంటుంది కాబట్టి అధిక వడ్డీని అందించే టెన్యూర్ ను ఎంచుకోవడానికి మీరూ ప్రయత్నం చేయాలి.

ప్రస్తుతం ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకులు ఎటువంటి కోటక్ మహీంద్రా బ్యాంకు తాజాగా తమ కస్టమర్లకు తీసుకురావడంతో ఫిక్స్డ్ డిపాజిట్ దారులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా పెంచుతూ ప్రకటించడం జరిగింది. పలురకాల కాలపరిమితిలో ని ఫిక్స్ డిపాజిట్లకు వర్తిస్తుంది అని గమనించాలి. 2 కోట్లకి లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుంది అని గుర్తించుకోవాలి. డొమెస్టిక్ ఎన్ ఆర్ ఈ, ఎన్ ఆర్ ఓ ఫిక్స్డ్ డిపాజిట్ ఎకౌంట్ లపై వడ్డీరేట్ల పెంపు ఉంటుందట. ఏప్రిల్ 12వ తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి అని కూడా స్పష్టం చేసింది. ఇక 121 రోజుల నుంచి 175 రోజులు వరకు మధ్య ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కొన్ని రకాల వడ్డీ రేట్లు లభిస్తాయి.

ఇకపోతే మూడు వందల అరవై నాలుగు రోజుల పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన వారికి 25 బేసిస్ పాయింట్లు మేర వడ్డీ రేట్లు పెంచినట్లు కోటక్ మహేంద్ర బ్యాంక్ తెలిపింది. క్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వరుసగా 4.5 శాతం అలాగే 4.75 శాతం వడ్డీ రేట్లను పెంచింది. నాలుగు సంవత్సరాలు లేదా ఆపైన ఐదు సంవత్సరాల లోపు రెండు కోట్ల వరకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన వారికి 5.5 శాతం వడ్డీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: