దేశవ్యాప్తంగా ఎంతో మంది పేద ప్రజలు రేషన్ బియ్యం పై ఆధారపడి జీవిస్తున్న విషయం తెలిసిందే. పేద అట్టడుగు వర్గాల వారు.. తినడానికి తిండి లేని ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆలోచించి ప్రతి భారత పౌరులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది . ఇక ఈ రేషన్ కార్డు ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇంటి సరుకుల కోసం ప్రజలకు పంచదార , కందిపప్పు, సబ్బులు, గోధుమలు , రాగులు, జొన్నలు వంటి వాటిని కూడా సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి,  వాటి ద్వారా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రేషన్ బియ్యం పై తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అదేమిటంటే రేషన్ కార్డు దారులు బియ్యం వద్దనుకుంటే నగదు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టడానికి సిద్ధమవుతోంది. ఇక ఆయా ప్రాంతాలలో డిమాండ్ ను  బట్టి బియ్యానికి 12 రూపాయల నుంచి 15 రూపాయల వరకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ విషయంపై పలు సామాజిక మాధ్యమాలలో సర్వే నిర్వహించగా ప్రజలు కూడా డబ్బు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే నేటి నుంచి ప్రజల అంగీకారం తీసుకోవడానికి మరొకసారి సర్వే నిర్వహించబడుతుంది. వచ్చే నెల నుండి ఈ నగదు బదిలీ పథకాన్ని అమలు  చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ఆలోచిస్తున్నారట. ఇక ఇందులో భాగంగానే ముందుగా ఈ పథకం నంద్యాల, అనకాపల్లి , గాజువాక , నరసాపురం, కాకినాడ వంటి ప్రాంతాలను ఎంచుకుని అమలు చేయనున్నారు. ఇకపోతే ఈ డబ్బులను నేరుగా ప్రజల ఖాతాలలోకి జమ చేస్తే మంచిదని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: