ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నవరత్నాల కింద పేదలందరికీ ఉచిత ఇల్లు కార్యక్రమంలో భాగంగానే నిర్మాణమవుతున్న కాలనీలకు డిస్కమ్ ల ద్వారా ఉచిత విద్యుత్తును అందించడానికి జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మొదటి దశలో సుమారుగా 12,49, 133 సర్వీసులకు విద్యుత్ ను ఉచితంగా అందించనున్నారు. దీనికి అవసరమైన నిధులను కూడా గృహనిర్మాణ శాఖకు సమకూర్చడానికి అన్నిరకాలుగా సిద్ధం చేసినట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే రూ.4,600 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి కూడా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

ఇకపోతే నవరత్నాల కింద పేదలందరికీ ఉచిత ఇళ్లు పథకం కింద ఏ పీ ఈ పి డి సి ఎల్ పరిధిలో ఉన్న జిల్లాలలో 3, 951 లేఅవుట్ లు ఉండగా 3,28,383 ఇళ్లకు విద్యుత్ సర్వీసులు కూడా ఇస్తున్నారు. పోతే ప్రభుత్వం  ఉచిత విద్యుత్ కోసం ఏకంగా రూ.1217.17 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఏ పీ ఎస్ పి డి సి ఎల్ పరిధిలో ఐదు జిల్లాలలో 2,813 లేఔట్ లు మాత్రమే ఉంటే 5,16,188 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను రూ.2,519 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనున్నారు. ఏపీ సి పి డి సి ఎల్ లో ఉన్న 5 జిల్లాలతో పాటు సిఆర్డిఏ పరిధిలో కూడా సుమారుగా ఆరు లక్షల ఇళ్లకు విద్యుత్ సర్వీసులను 1805 కోట్ల రూపాయలతో ఉచితంగా ఇవ్వడం గమనార్హం.

రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో కరెంటు వినియోగం కూడా ఎక్కువ అవుతుంది. కానీ కరెంటు బిల్లులు కట్టలేక సామాన్యుడికి భారంగా మారుతున్న నేపథ్యంలో జగనన్న ప్రభుత్వం కింద నిర్మించబడుతున్న అన్ని ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై పేదల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: